చిక్కుల్లో సంజనా.. పాత కేసుతో మళ్లీ జైలుకు వెళ్లక తప్పదా?

Updated on: Feb 13, 2025 | 6:57 PM

2005లో తరుణ్ నటించిన సోగ్గాడు సినిమాతోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది సంజనా గల్రానీ. ఆ తర్వాత ప్రభాస్ బుజ్జిగాడుతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన ఈమె.. దండుపాళ్యం సినిమాల్లోనూ నెగెటివ్ పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. సంజన గల్రానీ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు.

మూడు నెలలు జైలు శిక్ష అనుభవించారు. అయితే ఇటీవల ఆ కేసును అక్కడి హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సీసీబీ పోలీసులు ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కన్నడ నాట టాక్ నడుస్తోంది. దీంతో సంజన చిక్కుల్లో పడే ఛాన్స్‌ ఉందంటున్నారు. ప్రభుత్వ స్థాయిలో ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించిన పోలీసు అధికారులు.. అప్పీలుకు సంబంధించి పిటిషన్ ను కూడా సిద్ధం చేశారని తెలుస్తోంది. ప్రాసిక్యూషన్ అనుమతి వచ్చిన వెంటనే పిటిషన్ దాఖలు చేస్తామని.. బెంగుళూరు పోలీసు కమిషనర్ దయానంద్ కూడా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ విషయంపై సంజన ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక సంజన గల్రానీ కన్నడ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించింది. కొన్నేళ్ల క్రితమే వివాహం చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత సంజన సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ప్రస్తుతం సంజన తన ఫ్యామిలీకి పూర్తిగా టైమ్ కేటాయించి.. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

త్రిష ఎక్స్ ఖాతాలో షాకింగ్ పోస్ట్ ! అసలు విషయం చెప్పిన హీరోయిన్

Chiranjeevi: రాజకీయాల్లో రీ ఎంట్రీ పై.. చిరు సెన్సేషనల్ కామెంట్స్

రణభూమిని చీల్చుకుని పుట్టే నాయకుడు.. గూస్ బంప్స్‌ పుట్టిస్తోన్న VD టీజర్‌!

TOP 9 ET News: NTR క్రేజ్‌తో దందా..డబ్బు దండుకుంటున్న కేటుగాళ్లు

అయ్యో.. కొంపముంచిన సిబిల్‌ స్కోర్‌.. ఏం జరిగిందంటే