సంక్రాంతి మంచి గుణపాఠం నేర్పిందిగా

Edited By:

Updated on: Jan 25, 2026 | 9:26 PM

సంక్రాంతికి ఒకేసారి ఐదు సినిమాలు విడుదలవడం వల్ల నిర్మాతలు థియేటర్ల కొరత, కలెక్షన్ల పంపకాలు, మంచి చిత్రాలకు తగిన స్క్రీన్‌లు లభించకపోవడం వంటి తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రేక్షకులకు పండుగ వాతావరణం బాగున్నా, నిర్మాతలు మాత్రం భారీగా నష్టపోయారు. ఈ అనుభవంతో భవిష్యత్తులో, ముఖ్యంగా వేసవిలో విడుదలయ్యే సినిమాలు సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని గుణపాఠం నేర్చుకోవాలి.

ఒకేసారి వస్తే మూడు నాలుగు సినిమాలు వస్తే చూసే ఆడియన్స్‌కు బానే ఉంటుంది కానీ తీసే నిర్మాతలకే కష్టంగా ఉంటుంది. దానికి మరోసారి సాక్ష్యం సంక్రాంతి సినిమాలే. ఒకేసారి 5 సినిమాలు చూసి పండక్కి బానే పండగ చేసుకున్నారు ప్రేక్షకులు. కానీ ఎవరికీ థియేటర్స్ సరిపోక.. కలెక్షన్లు పంచుకున్నారు హీరోలు. మరి ఈ గుణపాఠం నుంచి మనోళ్లు ఏం నేర్చుకుంటున్నారు..? ప్రతీసారి సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు రావడం కామన్.. కానీ ఈసారి ఏకంగా 5 సినిమాలు వచ్చాయి. అందులో 4 సినిమాలకు టాక్ బాగానే వచ్చింది.. కానీ సేఫ్ అయింది మాత్రం మూడే. రాజా సాబ్ మొదట్లోనే రేస్ నుంచి తప్పుకుంటే.. టాక్ బాగా వచ్చినా పోటీ తట్టుకోలేక భర్త మహాశయులకు విజ్ఞప్తి పక్కకెళ్లిపోయింది. ఈ సంక్రాంతి నిర్మాతలకు చాలా విషయాలను నేర్పించింది. పండగ సీజన్ కదా అని ఒకేసారి అరడజన్ సినిమాలు తెస్తే.. ఫస్ట్ ప్రాబ్లమ్ థియేటర్స్ సరిపోవు.. ఇక రెండో ఇష్యూ బాగున్న సినిమాకు స్క్రీన్స్ సరిపోవు.. అది మన శంకరవరప్రసాద్ గారు విషయంలో జరిగింది కూడా. చూసే జనాలున్నా.. థియేటర్స్ లేక అర్ధరాత్రి షోలు కూడా నడిపించారు ఎగ్జిబిటర్లు. ఏపీలో చాలా చోట్ల చిరంజీవి సినిమాకు స్క్రీన్స్ సరిపోలేదు. మరోవైపు అనగనగా ఒకరాజు, నారీనారీ నడము మురారి సినిమాలకు టాక్ బాగా రావడం.. వాటికి కూడా సరిపోయేటన్ని స్క్రీన్స్ లేకపోవడం ఈ పండక్కి చూసాం. భర్త మహాశయులకు పండక్కి కాకుండా.. ఇంకో టైమ్‌లో వచ్చుంటే ఆడేది అనే మాటలు కూడా వినిపించాయి. పండక్కి 3 సినిమాలొస్తే ఓకే కానీ ఒకేసారి ఇన్నొస్తే అందరికీ సమస్యే.. ఇంత చిన్న లాజిక్ అర్థం చేసుకోకుండా సంక్రాంతికి ఆ కెపాసిటీ ఉందని సర్ది చెప్పుకుంటున్నారు మేకర్స్. మరి ఈ గుణపాఠం నుంచి సమ్మర్ నిర్మాతలు కొత్త విషయాలు నేర్చుకుంటారా..? ఎందుకంటే పెద్ది, ప్యారడైజ్, విశ్వంభర, ఉస్తాద్ ఇలా చాలా సినిమాలున్నాయి ఈసారి వేసవిలో. చూడాలిక ఏం జరగబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

NBK111 ముహూర్తం ఫిక్స్.. ఈసారి ప్లాన్ మామూలుగా లేదు

‘యాత్ర’ అయిపోంది.. ఇప్పుడు ‘పాదయాత్ర’ మొదలైంది

Jana Nayagan: జననాయగన్‌కు అమెజాన్ 120 కోట్ల దెబ్బ ??

Renu Desai: మరో జన్మ వరకు ఎందుకు ?? ఈ జన్మలోనే అన్నీ క్లియర్ చేస్తా

Mega158: ‘జన నాయగన్‌’ ఎఫెక్ట్.. చిక్కుల్లో చిరు నెక్స్ట్‌ మూవీ ??

Published on: Jan 25, 2026 09:25 PM