Boney Kapoor: నన్ను రూమ్‌కి కూడా రానిచ్చేది కాదు..

Updated on: Sep 10, 2025 | 2:58 PM

దివంగత నటి శ్రీదేవి చివరి రోజుల్లో నటించిన చిత్రం ‘మామ్’ (Mom). బోనీ కపూర్‌ నిర్మాతగా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం షూటింగ్‌ విశేషాలను తాజాగా బోనీ కపూర్‌ ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘మామ్‌’ కోసం శ్రీదేవి ఎంతో కష్టపడినట్లు చెప్పారు. శ్రీదేవి బాలీవుడ్‌కు వచ్చినప్పుడు ఆమెకు హిందీ మాట్లాడడం తెలియదనీ మొదటి ఆరు సినిమాలకు వేరే వాళ్లు డబ్బింగ్‌ చెప్పారనీ బోనీకపూర్‌ తెలిపారు.

తర్వాత ఆమె స్వయంగా డబ్బింగ్‌ థియేటర్‌లో హిందీ పాఠాలు నేర్చుకొని తన సినిమాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిందనీ అన్నార. తన చివరి చిత్రం ‘మామ్‌’ MOM లో ఎంతో అంకితభావంతో నటించిందనీ ఈ సినిమాకు తెలుగు, తమిళ, హిందీ వెర్షన్‌లకు స్వయంగా ఆమె డబ్బింగ్‌ చెప్పిందనీ మలయాళం పనులను దగ్గరుండి చూసుకుందనీ అన్నారు. అలాంటి నిబద్ధత చాలా తక్కువమంది ఆర్టిస్టులకు ఉంటుందని బోనీకపూర్ ప్రశంసించారు. ‘మామ్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో శ్రీదేవి తనతో రూమ్‌ పంచుకోవడానికి కూడా నిరాకరించిందని బోనీ కపూర్‌ తెలిపారు. పాత్రపై పూర్తిగా దృష్టిపెట్టాలని, మైండ్‌ డైవర్ట్‌ కాకుండా ఉండాలని ఒంటరిగానే రూమ్‌లో ఉండేదనీ అన్నారు. నోయిడా, జార్జియాలో షూటింగ్‌ జరిగే సమయంలోనూ రూమ్‌లో తను ఒంటరిగా ఉండేదనీ ఎప్పుడూ స్క్రిప్ట్‌ ప్రాక్టీస్‌ చేసుకునేదని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొడుకు లేడు.. కూతుళ్లు లేరు ఆ లగ్జరీ బంగ్లా నాకెందుకు ?? స్టార్‌ కపుల్‌.. షాకింగ్ నిర్ణయం!

‘స్పిరిట్’ పై సందీప్ రెడ్డి అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు

TOP 9 ET News: అల్లు కుటుంబానికి GHMC షాక్‌ కూల్చేస్తామంటూ నోటీస్‌

భరణికి మెగా సపోర్ట్‌ !! వర్కవుట్ అవుతుందా ?? లేక..

పైన పటారం.. లోన లొటారం..! బిగ్ బాస్ గుట్టు రట్టు చేసిన తేజస్వి