Parineeti Chopra: వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా తాకకువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకొని క్రేజ్ సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికి సరైన హిట్ మాత్రం అందుకోలేక పోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు ‘అమర్ సింగ్ చమ్కిలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. చమ్కిలా పాత్రలో దిల్జిత్ దోసాంజ్ ఆకట్టుకుంటే మరోవైపు పరిణీతి చోప్రా కూడా తన నటనతో ప్రశంసలు అందుకుంది.
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా తాకకువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకొని క్రేజ్ సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికి సరైన హిట్ మాత్రం అందుకోలేక పోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు ‘అమర్ సింగ్ చమ్కిలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. చమ్కిలా పాత్రలో దిల్జిత్ దోసాంజ్ ఆకట్టుకుంటే మరోవైపు పరిణీతి చోప్రా కూడా తన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ఆమె చమ్కిలా రెండో భార్య అమర్‌జోత్‌గా నటించింది. ఈ సినిమా కోసం పరిణితి తన బరువు కూడా 15 కిలోలు పెంచుకుంది.
ఇక అమర్ సింగ్ చమ్కిలా సినిమా హిట్ అవ్వడంతో.. తెగ ఖుషీలో ఉన్న పరిణితీ.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తి కర కమెంట్స్ చేసింది. చాలా మంది తనకు తప్పుడు సలహాలు ఇచ్చారని చెప్పింది. అవి విన్నాక, అప్పట్లో నాకు కరెక్ట్ అనిపించి చాలా సినిమాలు చేశాను. అయితే, ఆ సమయంలో తనకు ఇండస్ట్రీ గురించి పెద్దగా అవగాహన లేదని ఆమె అంగీకరించింది. దీంతో కెరీర్‌లో ఎన్నో పొరపాట్లు దొర్లాయి.. నేడు వాటి ఫలితాన్ని చవిచూస్తున్నా అని తెలిపింది. చెప్పిన మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా అని అంటుంది పరిణితి. దానికి బదులు తన మనసులోని మాటను విని ఉంటే బహుశా తన కెరీర్‌లో పొరపాట్లు తక్కువగా ఉండేవని చెప్పింది. అయితే ఆ సమయంలో సినిమాల ఎంపికలో ట్రెండ్స్‌ని ఫాలో అవ్వమని చెప్పే వారు తక్కువ అని తెలిపింది. సినీ పరిశ్రమ గురించి తనకేమైనా తెలిసి ఉంటే ఇంతమంది మాటలు వినాల్సిన అవసరం ఉండేది కాదని చెప్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!