Sonakshi Sinha: పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! బీ టౌన్‌లో హాట్ టాపిక్..

|

Aug 22, 2024 | 9:38 AM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహం జరిగి సుమారు 2 నెలలైంది. మనసారా ప్రేమించిన జహీర్ ఇక్బాల్‌ని పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడుపుతోందీ అందాల తార. అయితే ఈ మధ్య ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. సోనాక్షి ముంబైలోని తన ఇంటిని అమ్ముతోందట. అది తాను పెళ్లి చేసుకున్న ఆ ఇంటిని అమ్మకానికి పెట్టడం ఇప్పుడు బీ టౌన్‌లోనూ.. సోనాక్షి ఫ్యాన్స్ మధ్యలోనూ హాట్ టాపిక్ అవుతోంది.

అసలు విషయం ఏంటంటే! ముంబైలోని బాంద్రాలో సోనాక్షి సిన్హాకు ఒక లగ్జరీ ఇల్లు ఉంది. సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ ఫ్లాట్ చాలా విశాలంగా ఉంటుంది. సుమారు 4200 చదరపు అడుగుల ఈ ఇంట్లో విశాలమైన 2 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. అంతేకాదు జిమ్, ప్రైవేట్ లిఫ్ట్ మొదలైన సౌకర్యాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ ఇంటి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో ఇంట్లోని ప్రతి గదిని చూపించారు. అయితే ఇందులో సోనాక్షి సిన్హా ఇల్లు అని ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఇది సోనాక్షి ఇల్లు అని కరాఖండిగా చెబుతున్నారు. దీనికి తోడు ఈ వీడియోను స్వయంగా సోనాక్షి సిన్హా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ చేసింది.

ఇక ఈ లగ్జరీ ఇంటి ధర 25 కోట్ల రూపాయలు! ముంబై నగరంలో ఇంత ఎక్కువ ధరకు ఆస్తిని విక్రయించడానికి సిద్ధ పడటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న సోనాక్షి సిన్హా తన ఇంటిని ఎందుకు అమ్ముతోందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ వివాహం కూడా ఇదే ఇంట్లో జరిగింది. మరీ ఇంత సడెన్ గా ఎందుకు ఇంటిని విక్రయానికి పెట్టుందో సోనాక్షినే చెప్పాలి. అసలు ఆ వీడియోలో కనిపిస్తున్న ఇల్లు ఆమెదే అని వస్తున్న వార్తల్లో నిజం ఎంత..? వీటన్నింటినీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.