Bigg Boss Telugu: బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఫినాలేకు దగ్గరపడుతున్న తరుణంలో స్టార్ మా ఛానెల్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 8 నుండి బిగ్‌బాస్ ప్రసార సమయాల్లో మార్పులు చేసింది. కొత్త సీరియల్ 'పొదరిల్లు' కోసం ఈ మార్పులు చేశారని తెలుస్తోంది. ఇకపై సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు బిగ్‌బాస్ ప్రసారం కానుంది. వీకెండ్ సమయాలు యథావిధిగా ఉంటాయి.
బిగ్‌బాస్ సీజన్-9 ప్రస్తుతం మాంచి ఊపులో ఉంది. మరో రెండు వారాల్లో ఫినాలేలోకి అడుగుపెడుతోంది. రేటింగ్‌లో కూడా దూసుకుపోతోంది. అందులోనూ హౌస్లో ఉన్న తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్! ఈ ముగ్గురిలో ఎవరు విన్నర్ అనే చర్చ గట్టిగానే జరుగుతోంది. ఇలాంటి సమయంలో బిగ్‌బాస్ షోకి చిన్న ఝలక్ ఇచ్చింది స్టార్ మా ఛానల్. ఎస్ ! స్టార్ మాలో పొదరిల్లు అనే కొత్త సీరియల్ స్టార్ట్ కాబోతోంది. ఈ సీరియల్ కోసం ఏకంగా బిగ్ బాస్ టైమ్‌నే మార్చేసింది స్టార్ మా. బిగ్ బాస్ సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9.30 గంటలకి ప్రసారమవుతుంది. వీకెండ్‌లో అంటే శని-ఆదివారాల్లో రాత్రి 9 గంటలకే టెలికాస్ట్ అవుతుంది. డిసెంబర్ 8 నుంచి మాత్రం ఈ టైమింగ్స్ మారబోతున్నాయి. ఇక బిగ్‌బాస్ రాత్రి 10 గంటలకి ప్రసారం కానుంది. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 10 గంటలకి స్టార్ మాలో వస్తుంది. వీకెండ్ మాత్రం ఎప్పటిలానే రాత్రి 9 గంటలకే ప్రసారం అవుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ritu Choudhary: భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
TOP 9 ET News: రాజ్ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు?
