ఓవర్ యాక్షన్ చేశాడు.. దెబ్బకు గెటౌట్ అయ్యాడు !! ఇవే తగ్గించుకోవాలి భయ్యా !!

|

Sep 24, 2024 | 1:22 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ లో మరో వారం గడిచిపోయింది. అందరూ ఊహించినట్లుగానే మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ ను బండ బూతులు తిట్టిన అతనిపై హోస్ట్ నాగార్జున కూడా ఫైరయ్యారు. రెడ్ కార్డ్ చూపించి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లమన్నారు. దీంతో శనివారమే అంటే సెప్టెంబర్ 21నే అభయ్ నవీన్ ఎలిమినేట్ అవుతాడని చాలా మంది భావించారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ లో మరో వారం గడిచిపోయింది. అందరూ ఊహించినట్లుగానే మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ ను బండ బూతులు తిట్టిన అతనిపై హోస్ట్ నాగార్జున కూడా ఫైరయ్యారు. రెడ్ కార్డ్ చూపించి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లమన్నారు. దీంతో శనివారమే అంటే సెప్టెంబర్ 21నే అభయ్ నవీన్ ఎలిమినేట్ అవుతాడని చాలా మంది భావించారు. అయితే తోటి కంటెస్టెంట్లు ప్రాధేయ పడడం, చివరకు నాగార్జున రిక్వెస్ట్ చేయగా బిగ్ బాస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే అది ఒక్కరోజుకు మాత్రమే. ఎస్ ! ఇక శనివారం సేఫ్ అయిన అభయ్ నవీన ఆ నెక్స్ట్‌ డే ఆదివారం అంటే సెప్టెంబర్ 22 మాత్రం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఓటింగ్ తక్కువగా ఉండడంతో అభయ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో ఎనిమిదో సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి మూడో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభయ్ నవీన్ సరిగ్గా మూడు వారాలకే బ్యాగ్ సర్దేసుకున్నాడు. షో ప్రారంభంలో అభయ్ నవీన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చాలా మంది భావించారు. కానీ అతను ఏ మాత్రం ఎఫెక్టివ్ గా గేమ్ ఆడలేకపోయాడు. టాస్కులు, గేముల్లోనూ పూర్తిగా డల్ అయిపోయాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షూటింగ్‌ మొదలెట్టడమే కాదు.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.. దటీజ్ పవన్‌ !!