Rithu Chowdary: డిమాన్ కోసం బయట కష్టపడుతున్న రీతూ చౌదరి!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి చేరుకుంది. గ్రాండ్ ఫినాలేలో డిమాన్ పవన్ గెలుపు కోసం మాజీ కంటెస్టెంట్స్ రీతూ చౌదరి, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్, ఆశా షైనీ మద్దతునిస్తున్నారు. డిమాన్ పవన్‌కు PR టీమ్ లేదని, జెన్యూన్ కంటెస్టెంట్ అని పేర్కొంటూ, ప్రేక్షకులు అతనికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఈ వారంలోనే విన్నర్ ఎవరు అనేది తేలిపోనుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఈ వారంలోనే ఎండ్ కార్డ్ పడనుంది. డిసెంబర్ 21 రాత్రి జరిగే గ్రాండ్ ఫినాలే కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. తనూజ, పవన్ కల్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజనా బిగ్ బాస్ టైటిల్ రేసులో ఉన్నారు. ఈ క్రమంలో ఆయా కంటెస్టెంట్ల అభిమానులతో పాటు మాజీ కంటెస్టెంట్స్ కూడా తమకు ఇష్టమైన వారికి మద్దతునిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో డిమాన్ పవన్ గెలుపు కోసం రీతూ చౌదరి రంగంలోకి దిగింది. మాజీ కంటెస్టెంట్స్ తో కలిసి వరుసగా వీడియోలు చేస్తోంది. తన బంధాన్ని హౌస్‌లోనే కాదు.. బయట కూడా కంటిన్యూ చేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా షేర్ చేసిన ఓ వీడియోలో ముందుగా రాము రాథోడ్ ను అడగగా… ‘నేనైతే పవన్ అని అనుకుంటున్నాను. నాకైతే జెన్యూన్ గా నా మైండ్ కి స్టార్టింగ్ నుంచి కనెక్ట్ అయిన వ్యక్తి అతనే. అతనికి సరిగ్గా ఆడడానికి స్కోప్ దొరకలేదు. మనోడు ఆడితే ఎవరూ కూడా పక్కన నిలబడలేరు’ అంటూ రాథోడ్ చెప్పాడు. ఇక ఆ తర్వాత మరో మాజీ కంటెస్టెంట్ సాయి శ్రీనివాస్ ను నీ సపోర్ట్ ఎవరికి అంటూ రీతూ అడగగా.. డీమాన్ అంటూ చెప్పాడు. మనోడు గేమ్ కి అందరూ పడిపోయారు. నాకు కూడా పర్సనల్ గా మంచి ఫ్రెండ్. ఆడియన్స్ మీరందరూ కూడా ఒక కామనర్ ని గెలిపించాలి అని రిక్వెస్ట్ చేశాడు సాయి శ్రీనివాస్. ఇక రీతు చౌదరి మాట్లాడుతూ.. డిమాన్ పవన్‌కి అసలు PR టీమే లేదని చెప్పుకొచ్చింది. పవన్‌ను గెలిచేందుకు అందరూ ఓట్లు వేసి సపోర్ట్ చేయాలని వేడుకుంది. ఇక మరో మాజీ కంటెస్టెంట్ ఆశాషైనీ అలియాస్ ఫ్లోరా షైనీ కూడా డిమాన్ పవన్ కు మద్దతుగా పలుకుతూ వీడియోను పోస్ట్ చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాప్ 10 ప్రపంచ సుందరీమణుల్లో.. మన హీరోయిన్
పఠాన్ 2లో మన టైగర్.. NTRను నమ్ముకున్న షారుఖ్
300 ఫోక్ సాంగ్స్.. ఇప్పుడు హీరోయిన్ !! నాగ దుర్గ ఎక్కడికో వెళ్లిందిగా..
Abhi: ప్రభాస్ పక్కన నటిస్తే.. 11 వేలు ఇచ్చారు! అభి కామెంట్స్!
