ఈసారి చదరంగం కాదు రణరంగం.. అదిరిపోయిన బిగ్‌బాస్ సీజన్ 9 ప్రోమో..

Updated on: Jun 28, 2025 | 9:31 AM

బుల్లితెర అడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రియాల్టీ షో.. బిగ్‏బాస్. ఇప్పటివరకు తెలుగులో 8 సీజన్స్ పూర్తికగా..ఇప్పుడు సీజన్ 9 రాబోతుంది. సెప్టెంబర్ మొదటివారంలో ఈ షో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఈ షోలోకి రాబోయే కంటెస్టెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇన్ స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, సినీ, టీవీ కళాకారులు పాల్గొననున్నట్లు సమాచారం.

అలాగే ఇటీవల వివాదాలతో ఫేమస్ అయిన సోషల్ మీడియా తారలను సైతం తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా బిగ్‏బాస్ సీజన్ 9 లోగోను లాంచ్ చేస్తూ చిన్న ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఆ ప్రోమోలో…ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు.. కొన్ని సార్లు ప్రభంజనం సృష్టించాలి.. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్స్ ఈ సీజన్ పై మరింత ఆసక్తిని పెంచేసాయి. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా నాగార్జుననే హోస్టింగ్ చేయనున్నారని ప్రోమోతో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2లో ఉన్నవారిలో చాలా మంది బిగ్‏బాస్ షోలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీట్‌ మాక్‌ టెస్ట్‌లో మార్కులు తక్కువొచ్చాయని కూతురిని చితకబాదిన తండ్రి.. కట్‌చేస్తే

అడవిలో భారీ మనిషి ఆకారం.. దగ్గరకెళ్లి చూడగా

కొలనులో కొండచిలువ.. అది కక్కింది చూసి జనం షాక్‌

గ్యాస్‌ సిలిండర్ల సరఫరా ఆగిపోనుందా.. కారణం అదేనా ??

ఎలక్ట్రిక్‌ విమానం వచ్చేసింది.. ఒక్కసారి చార్జి చేస్తే.. 463 కి.మీ