అతనితో ప్రేమలో ఉన్నా.. కానీ పెళ్లి మాత్రం చేసుకోను

Updated on: Oct 16, 2025 | 3:02 PM

సాధారణంగా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది తెగ బాధపడిపోతారు. ఏడుస్తారు. కానీ నటి లక్స్ పాప ఫ్లోరా షైనీ మాత్రం బిగ్ బాస్ హౌస్‌ నుంచి చిరునవ్వుతో బయటకు వచ్చేసింది. ఎలాంటి ఏడుపులు, పెడబొబ్బలు చేయలేదు. హౌస్ లో మొత్తం 5 వారాలున్న ఈ అందాల తార గేమ్స్ లు, టాస్కుల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. హౌస్‌మేట్స్‌తోనూ పెద్దగా కలవదు.

ఎంత సేపున్నా తన పనేదో తను చేసుకుపోయింది. అందుకే ప్రతి వారం ఎలిమినేషన్ దాకా వచ్చింది. కానీ త్రుటిలో మిస్ అయ్యింది. కానీ ఐదో వారం తక్కువ ఓటింగ్ రావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. బహుశా.. తన ఎలిమినేషన్ గురించి ఫ్లోరా ముందుగా ఊహించిందేమో! ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన లక్స్ పాప వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందరితో పంచుకుంటోంది. అలాగే ప్రేమ, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలపై ఓపెన్ గా మాట్లాడింది. నాకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు. కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం మాత్రం అసలు లేదంటూ ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్స్ చేశారు ఈమె. అంతేకాదు అలా ఎందుకనేది వివరణ కూడా ఇచ్చారు. ప్రస్తుతం జనరేషన్ లో పెళ్లి చేసుకున్న రెండుమూడేళ్లకే విడాకులు అవుతున్నాయి. అలా తన ఫ్రెండ్స్ లో చాలా మందిని చూశాను. కాబట్టి వివాహం జోలికి వెళ్లకూడదనుకుంటున్నాను. ప్రస్తుతానికి రిలేషన్‌షిప్‌లోనే సంతోషంగా ఉంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఫ్లోరా షైనీ. తెలుగుతో పాటు పలు హిందీ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఫ్లోరా షైనీ అలియాలిస్ ఆశా షైనీ. ముఖ్యంగా నరసింహ నాయుడు చిత్రంలో ‘లక్స్‌ పాప.. లక్స్‌ పాప’ అంటూ ఆమె వేసిన స్టెప్పులు తెలుగు ఆడియెన్స్ కు ఇప్పటికీ గుర్తున్నాయి. అదే సమయంలో ఓ ప్రముఖ నిర్మాతను ఈ ముద్దుగుమ్మ ప్రేమించింది. కానీ అతను తనకు నరకం చూపించాడని పలు సందర్భాల్లో వాపోయిందీ అందాల తార.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త పెళ్లికొడుకుకి ఎన్టీఆర్ స్పెషల్ సర్‌ప్రైజ్‌

అంత అమాయకురాలినేం కాదు.. దీపిక తీరుపై మాజీ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్

హీరోయిన్‌కు వింత రోగం.. చెప్పుకోలేక.. భరించలేక తీవ్ర ఇబ్బంది

Published on: Oct 16, 2025 03:01 PM