బిగ్ బాస్ ఫేం హిమజ ఇంట్లో తీవ్ర విషాదం.. ఏడుస్తూ వీడియో పెట్టిన నటి వీడియో

Updated on: Dec 14, 2025 | 9:57 PM

యాక్టర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హిమజ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి మరణించినట్లుగా ఇన్‌స్టాలో ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. "మిమ్మల్ని మిస్ అవుతున్నాను నాన్న" అంటూ తండ్రితో ఫోటోలు పంచుకున్నారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు, ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.

బిగ్ బాస్ ఫేం, నటి హిమజ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి మరణించడంతో హిమజ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన తండ్రి మరణించినట్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ వీడియో షేర్ చేశారు. “పైనున్న స్వర్గం తన లివింగ్ సోల్‌ను తీసుకెళ్లిపోయింది. మిమ్మల్ని మిస్ అవుతున్నాను నాన్న” అంటూ తండ్రితో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ హిమజ కన్నీరుమున్నీరయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ దుఃఖ సమయంలో నెటిజన్లు హిమజకు ధైర్యం చెబుతూ, ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.