మొన్నటి దాకా రీతూ.. ఇప్పుడు భరణి! పవన్ గేమ్ ఖతం
బిగ్‌బాస్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ రేసులో మూడో ఛాలెంజ్ డీమాన్ పవన్, భరణి మధ్య జరిగింది. బ్రిడ్జి నిర్మించి బ్యాగులు విసిరే ఈ పోటీలో భరణి వేగంగా గెలిచాడు. పవన్ ప్లాంక్స్‌ను అమర్చడంలో తడబడి, సలహాలు వినకుండా ఓటమి పాలయ్యాడు. దీంతో టికెట్ టు ఫినాలే నుంచి పవన్ నిష్క్రమించగా, భరణి విజేతగా నిలిచాడు.
బిగ్‌బాస్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ రేసులో మూడో ఛాలెంజ్ కూడా జరిగింది. ఇందులో డీమాన్ పవన్-భరణి మధ్య బిగ్‌బాస్ పోటీ పెట్టాడు. తనూజ ఈ టాస్కుకి సంచాలక్‌గా వ్యవహరించింది. ఈ గేమ్‌లో గెలవడానికి ముందుగా ఇద్దరూ వారివారి బాక్స్‌ని డిస్ మ్యాంటిల్ చేసి దానిలోని ప్లాంక్స్‌ని ఒక్కొక్కటిగా తీసుకెళ్లి బ్రిడ్జిలో సరిగ్గా ఉండేలా అమర్చాలి.ఆ తర్వాత బాక్స్‌లో ఉండే మూడు బ్యాగ్స్‌ని ఒక దాని తర్వాత ఒకటి తీసుకొని వాళ్లు పూర్తి చేసిన బ్రిడ్జి మీదుగా నడుచుకుంటూ వెళ్లి వాటిని టేబుల్‌పై ఉండేలా విసరాల్సి ఉంటుంది.. ఇలా ఎవరూ ముందు ఫినిష్ చేస్తారో వాళ్లు ఈ గేమ్ విజేతలు అవుతారు. ఇక బజర్ మోగగానే భరణి చకచకా బ్రిడ్జి ఏర్పాటు చేసేశాడు. మరోవైపు డీమాన్ ఎంత బల ప్రయోగం చేసినా కూడా ఆ ప్లాంక్స్ కొన్ని సెట్ అవ్వలేదు. అది పట్టకపోతే వేరే దానికి ట్రై చేయమని ఓ వైపు రీతూ, తనూజ చెబుతున్నా పవన్ చెవికి ఎక్కించుకోలేదు. కట్ చేస్తే.. ఇంతలో భరణి బ్రిడ్జి కట్టేసి.. బ్యాగులు కూడా టేబుల్ మీద విసిరేసి గేమ్ గెలిచేశాడు. కానీ అప్పటికీ డీమాన్ బ్రిడ్జి దగ్గరే ఉండిపోయాడు. ఇలా టికెట్ టూ ఫినాలే నుంచి పవన్ తప్పుకున్నాడు. అంతేకాదు తనదే టికెట్ టూ ఫినాలే అని తను విసిరిన ఛాలెంజ్‌లో తనే ఓడిపోయాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. బిడ్డను చూడడానికి వెళ్లిన తండ్రిని ఏం చేశారంటే..
Hardik Pandya: సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హార్ధిక్ ??
Elon Musk: ఎలన్ మస్క్ కుమారుడి పేరు శేఖర్
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
