ఈసారి బిగ్ బాస్‌ కు ఏమైంది.. ఇన్ని తప్పులా…? అసలు ఆ ఇంట్లో ఎం జరుగుతుంది..?

|

Sep 27, 2021 | 10:12 AM

అసలు బిగ్‏బాస్‏కు ఏమైంది ? ఈసారి ఆటపై పెద్ద బాస్‏కు ఇంట్రెస్ట్ లేదా ? షోపై ఆసక్తి చూపించడం లేదా ? కంటెస్టెంట్స్ తీరుపై ఎందుకు ఇప్పటికీ నోరు మెదపడం లేదు ? అనే సందేహాలు ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా బిగ్‏బాస్ ఇంట్లోకి రావడానికి ముందే షో నియమ నిబంధనల గురించి కంటెస్టెంట్స్‏కు తెలియజేస్తుంటారు. అందులో ఒకటి కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనేది. ఒకవేళ ఇంట్లోకి వచ్చాక కూడా సభ్యులు ఇంగ్లీష్, హిందీ మాట్లాడితే కచ్చితంగా హెచ్చరిస్తారు. కానీ ఈసారి సీజన్ 5 ప్రారంభమై… మూడు వారాలు గడుస్తున్నా.. ఇప్పటికీ కంటెస్టెంట్స్ తీరులో మార్పు రాలేదు. ఇప్పటికీ ఇష్టానుసారంగా ఇంగ్లీష్, హిందీలోనే మాట్లాడుతున్నారు. ఒక్క పదం అంటే ఏమో అనుకోవచ్చు.. కానీ ఇద్దరి మధ్య సంభాషణ జరగాలంటే.. ఇంగ్లీష్, హిందీనే ఎంచుకుంటున్నారు. దీంతో వారు మాట్లాడేది అర్థం కాక ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. బిగ్‏బాస్ ఒక్కసారి చెప్పండి… నాగార్జున సర్ మీరైన గుర్తుచేయండి ఇది తెలుగు షో అంటూ సోషల్ మీడియాలో తమ గోడు వెల్లబోస్తున్నారు.

అలాగే కంటెస్టెంట్స్ సభ్యులు ఎక్కువగా బూతులు మాట్లాడేస్తున్నారు.. దీంతో ప్రతిసారీ బీప్ సౌండ్ వెయాల్సి వస్తుందనేది మరో వాదన. ఇవే కాకుండా.. బిగ్‏బాస్‏ సైతం ప్రతిసారి పప్పులో కాలేస్తున్నాడు. చిన్న చిన్న పొరపాట్లతో నెటిజన్లకు అడ్డంగా దొరికిపోతున్నాడు. ఇంతకు ముందు సీజన్లలో ఎపిసోడ్‏కు సంబంధించిన ప్రోమోతోనే ఆసక్తిని కలిగించేవాడు… కానీ ఈసారి అలా జరగడం లేదని చూస్తున్న ప్రేక్షకులంటున్నారు.
YouTube video player

మరిన్ని చదవండి ఇక్కడ : RS.2 crore For Haircut Video: హెయిర్‌కట్‌లో పొరపాటు..రూ.2 కోట్లు నష్టపరిహారం..! వైరల్ గా మారిన వీడియో

 Bihar court: కోర్ట్‌ ఆర్డర్‌: ఊరి ఆడవాళ్లందరి బట్టలు ఉతికి ఐరన్‌ చేయాలి.. వింత పనిష్మెంట్ (వీడియో వైరల్)

 Bharat Bandh Live Video: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన ‘భారత్ బంద్’.. (లైవ్ వీడియో)

 Cyclone Gulab Live Updates video: తీరం దాటిన గులాబ్‌ తుఫాన్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. (లైవ్ వీడియో)