ఈసారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన నిఖిల్..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్‌కి చేరింది. గ్రాండ్ ఫినాలే రేసులో తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజనా గల్రానీ ఉన్నారు. ప్రస్తుతం కల్యాణ్ ఓటింగ్‌లో దూసుకుపోతుండగా, తనూజ రెండో స్థానంలో ఉంది. మాజీ కంటెస్టెంట్ నిఖిల్, కల్యాణ్ లేదా ఇమ్మాన్యుయేల్‌లో ఒకరు విన్నర్ అవుతారని అంచనా వేశారు. విన్నర్ ఎవరు అనేది ఆదివారం తేలుతుంది.
బిగ్‌బాస్ సీజన్-9 క్లైమాక్స్‌కి చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ బిగ్ బాస్ సీజన్ కు డిసెంబర్ 21 తో ఎండ్ కార్డ్ పడనుంది. గతంలో లాగే ఈసారి కూడా చాలా మంది ప్రముఖులు, కామనర్లు కంటెస్టెంట్లు గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చివరకు ఐదుగురు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టైటిల్ రేసులో నిలిచారు. తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజనా గల్రానీ ఈసారి టాప్-5 కంటెస్టెంట్లుగా ఉన్నారు. పేరుకు ఐదుగురు ఉన్నా టైటిల్ రేసు తనూజ, కల్యాణ్ ల మధ్యనే ఉందని ఈజీగా అర్థమవుతోంది. వీరి మధ్య టప్ ఫైట్ జరుగుతోంది. పీఆర్ హ్యాండిల్స్, ఫ్యాన్స్, ఫాలోవర్లు.. తమ కంటెస్టెంట్‌ని గెలిపించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కల్యాణ్ ఓటింగ్ లో టాప్ లో దూసుకెళుతున్నాడు. తనూజ సెకెండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. అలాగే ఇమ్మాన్యుయేల్ మూడు, డిమాన్ పవన్ నాలుగు, సంజనా ఐదో ప్లేసులో ఉన్నారు. మరోవైపు పలువురు బుల్లితెర ప్రముఖులు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు తమకి నచ్చిన వారికి సపోర్ట్ చేస్తూ ఓట్లు వేయాలని సోషల్ మీడియా వేదికగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే డిమాన్ పవన్ కు సపోర్టుగా రీతూ చౌదరి, శ్రీనివాస సాయి, రాము రాథోడ్ కలిసి ఒక వీడియోను రిలీజ్ చేశారు. తాజాగా బిగ్‌బాస్ సీజన్-8 విన్నర్ నిఖిల్ బిగ్ బాస్ ఫైనల్ లో తన ఓటు ఎవరికో చెప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ వీడియోలో నిఖిల్ తో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ టేస్టీ తేజ, నిఖిల్ నాయర్ కూడా ఉన్నారు. ‘విన్నర్ ఎవరనుకుంటున్నావ్.. అని నిఖిల్‌ని టేస్టీ తేజ అడిగాడు. దీనికి ‘ఇమ్మానుయేల్ లేకపోతే కళ్యాణ్’.. అంటూ నిఖిల్ ఆన్సర్ ఇచ్చారు. అయితే ఈ వీడియోపై భిన్న రకాల రియాక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా తనూజ అభిమానులు నిఖిల్ పై మండిపడుతున్నారు. మరి నిఖిల్ చెప్పినట్లు కల్యాణ్ లేదా ఇమ్మాన్యుయేల్ లో ఎవరు బిగ్ బాస్ టైటిల్ గా నిలుస్తారో తెలుసుకోవాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Taapsee Pannu: జుట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలతో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చిన తాప్సీ
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కొత్తగా పుట్టిన కొడుకే వారసుడని షాకింగ్ ప్రకటన
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్ ఉన్న గూఢాచార పక్షి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
