ఈ బుగ్గ గిల్లడాన్ని ఏమంటారో మరి
వైల్డ్ కంటెస్టెంట్ గా వచ్చిన అయేశా.. షోలో ఓ కామెంట్ చేసింది. హౌస్‌లో పరిస్థితి ఎలా ఉందంటే.. బిగ్ బాస్ హౌస్‌లో చివరి వరకు ఉండాలంటే.. ఓ బాండ్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టే ఉంది. అయితే అలాంటి పరిస్థితి ఈ హౌస్‌లో ఉండొద్దని తాను కోరకుంటున్నట్టు చెప్పింది. అయితే అయేశా మాత్రమే కాదు.. బీబీ ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నారు.
సీజన్ 1 నుంచి ఈ షోను ఫాలో అవుతున్న తెలుగు ఆడియెన్స్.. హౌస్‌లో పుట్టుకొచ్చే ఫేక్ ప్రేమలను చూసి విసిగిపోయారు. ప్రతీ సీజన్స్‌లో ఇలాంటి లవ్ ట్రాక్స్ కనిపిచడం.. బయటికి వచ్చాక.. ఎవరి దారి వారు చూసుకుని వెళ్లిపోవడం.. ఇవన్నీ గమనిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ సీజన్‌లో కూడా రీతూ – పవన్ మధ్య హౌస్‌లో లవ్ ట్రాక్ వడవడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది.అందులోనూ కలిసి ఉన్న నాలుగు రోజులకే.. నిన్ను విడిచి నేను హౌస్ నుంచి వెళ్లలేనంటూ పలు సందర్భాల్లో రీతూ ఏడడం.. బీబీ ఫ్యాన్స్ చాలా ఫేక్ గా అనిపించింది. హౌస్‌లో సర్‌వైవ్ అవ్వడం కోసమే పవన్ – రీతూ ఇద్దరూ ఇలా లవ్ ట్రాక్ నడిపిస్తున్నారనే కామెంట్ వచ్చింది. కట్ చేస్తే రీతూకు ఇంటి నుంచి వచ్చిన లెటర్ కారణంగా.. అందులో తన తల్లి.. ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడు.. డీవియేట్ అవ్వకు అంటూ చెప్పిన మాటల కారణంగా.. కాస్త మారిపోయినట్టు కనిపించింది. తమ మధ్య అందరూ అనుకుంటున్నట్టే ఏం లేదని.. పదే పదే చెబుతూ వస్తోంది. నాగ్ తోకూడా ఇదే మాట చెప్పింది. మరో పక్క డిమాన్ పవన్ కూడా సోలోగానే ఆడుతున్నట్టు కటింగ్ ఇస్తూ వచ్చాడు.రీతూ తనకు మధ్య ఏం లేదని.. తను బెస్ట్ అంటూ చెబుతూ వస్తన్నాడు. ఈ క్రమంలోనే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయిన అయేశాతో కాస్త కలివిడిగా మాట్లాడుతున్నాడు. రీసెంట్ ఎపిసోడ్‌లో ఆమెతో సాల్సా డ్యాన్స్ కూడా చేశాడు. అయితే ఈ కారణంగా బుంగమూతి పెట్టుకున్న రీతూను అర్థరాత్రి బుజ్జగిస్తున్న పవన్.. ఉన్నట్టుండి.. రీతూ బుగ్గ గిల్లాడు. అయితే ఈ సీనే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ బుగ్గ గిల్లడాన్ని ఏమంటారో మరి.? అనే ప్రశ్న ఈ ఇద్దరికీ బీబీ ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో ఎదురవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చూసే వాళ్ళం పిచ్చోళ్ళమా బిగ్ బాస్! సంజన – మాధురి తీరుపై జనం ఆగ్రహం
మాట తప్పిన మాధురి.. సార్ మాట కాదని వెస్ట్రన్ బట్టల్లో
ఎంకి పెళ్ళి సుబ్బి చావు అంటే ఇదే.. పాపం మాధురి దెబ్బకి నలిగిపోతున్న భరణి
మమిత – క్రికెటర్ గిల్ మధ్య ఇలా లింకు పెట్టారేంట్రా ??
వీళ్లవి నోళ్లు కాదు మైకు సెట్లు.. రీతూ – ఆయేషా గొడవతో.. అందరికీ తలనొప్పి
