ఎట్టకేలకు ఈ మొండిపిల్ల.. కెప్టెన్ అయ్యెనప్పా

Updated on: Nov 15, 2025 | 1:18 PM

బిగ్ బాస్ తెలుగు 9 తొమ్మిదవ వారం కీలక దశకు చేరింది. టాప్ కంటెస్టెంట్ తనూజ ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో అద్భుతంగా రాణించి, మొదటిసారి కెప్టెన్‌గా నిలిచింది. ప్రతి వారం నామినేషన్లలో ఉన్నా అధిక ఓట్లతో నిలుస్తున్న తనూజ కెప్టెన్సీ టైటిల్ రేసులో ఆమె స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. ఇది ఆమె టైటిల్ కలలకు కొత్త ఊపిరినిచ్చింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ రియాలిటీ షో తొమ్మిదవ వారంలోకి వచ్చేసింది. దీంతో ఇప్పటి నుంచి కంటెస్టెంట్ల గేమ్ కీలకంగా మారనుంది. వారి ఆట, మాట తీరే వారిని హౌస్ లో ఉంచాలా? వద్దా? అని నిర్ణయిస్తోంది. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్ తనూజ ఇప్పటివరకు ఒక్కసారి కూడా హౌస్ కెప్టెన్ కాలేదు. అయితే ఈ వీక్ మాత్రం కెప్టెన్సీ టాస్కులో ఆమె శివంగిలా రెచ్చిపోయింది. మొత్తానికి బిగ్ బాస్ కెప్టెన్సీ బ్యాండ్‌ను చేజిక్కించుకుంది. ఈ వారం కెప్టెన్సీ పోరు కోసం బిగ్ బాస్ బీబీ రాజ్యం పేరుతో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో తనూజ బాగా ఆడి కెప్టెన్సీ కంటెండర్ వరకు చేరుకుంది. ఫైనల్ కింగ్ నిఖిల్, క్వీన్ రీతూ, కమాండర్ నుంచి తనూజ.. ఇక ప్రజల నుంచి సుమన్, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ కంటెండర్లు నిలిచారు. వీరిలో నలుగురు పోటీ పడగా చివరకు తనూజ కెప్టెన్సీని సొంతం చేసుకుంది. ఫైనల్ గా తొమ్మిదో వారం కెప్టెన్ గా తనూజ నిలిచిందని తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఇవాళ్టి ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరైన తనూజ… దాదాపు ప్రతి వారం నామినేషన్స్ లో నిలుస్తోన్నా కూడా.. ఆమెకు బయటి నుంచి భారీగా ఓట్లు పడుతున్నాయి. ఈ వారం ఓటింగ్ లోనూ ఆమె టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఒకవేళ తనూజ కెప్టెన్ అయితే మాత్రం టైటిల్ రేసులో ఆమె మరో మెట్టు పైకెక్కినట్టే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kaantha: ఏం చేస్తాం..!కొన్ని సార్లు తప్పులు జరుగుతాయి.. కాంతా రివ్యూ

అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!

సబ్‌ రిజిస్ట్రార్‌కే కుచ్చు టోపీ పెట్టారుగా

180 కి.మీ స్పీడ్‌లో ‘వందేభారత్‌’ .. తొణకని గ్లాసులో నీరు

Karnataka Farmers: చెరుకు రైతుల అసహనం.. రోడ్డుపై బీభత్సం