కమెడియన్ హీరోగా మారుతున్న వేళ ?? గెలుపుపై తీవ్ర ఉత్కంఠ
బిగ్ బాస్ సీజన్ 9 విజేతపై ఉత్కంఠ కొనసాగుతోంది. తనుజ, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్ మధ్య ఓటింగ్ తీవ్ర పోటీని సృష్టిస్తోంది. మొదట్లో తనుజ ముందంజలో ఉన్నా, ఇప్పుడు ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ ఓట్లు పెరిగాయి. ఫైనల్ రేసులో కామనర్స్‌తో పాటు సీరియల్ బ్యూటీలు హోరాహోరీగా తలపడుతున్నారు. చివరి క్షణంలో మారిన ఓటింగ్ సరళి విజేత ఎవరో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 9… విన్నర్ ఎవరు అవుతారనే విషయంపై విపరీతమైన బజ్ నెలకొంది. ముందు నుంచి తనూజ పేరు వినిపిస్తుండగా.. ఈమధ్య కాలంలో కళ్యాణ్ పడాల పేరు తెరపైకి వచ్చింది. మరి కొంత మంది ఇమ్మాన్యుయేల్ పేరు కూడా వైరల్ చేస్తుండడం లేటెస్ట్‌గా కనిపిస్తోంది.మరో పక్క డీమాన్ పవన్ కూడా విన్నయినా ఆశ్చర్య పోనక్కర్లేదని ఈ షో అనలిస్టులు చెబుతున్న మాట. వెరసి బిగ్ బాస్ ఫైనల్ ఓటింగ్ ఇప్పుడు ఉత్కంఠగా సాగుతోంది. గెలుపు ఎవరిదనే క్యూరియాసిటీ అందర్లో కలిగిస్తోంది. ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి కామనర్స్‌గా ఎంట్రీ ఇచ్చి.. టాప్ 5లో నిలిచారు డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల. వీరిద్దరి తమ ఆట తీరుతో.. టాస్కుల్లో అదరగొట్టేస్తూ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక తమ ప్రవర్తన, మాట తీరుతో కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. కానీ సీరియల్ బ్యూటీ తనూజ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు ఈ ఇద్దరూ తక్కువ అయిపోతున్నారనే కామెంట్ ఉంది. ఇక ఇప్పుడు ఫినాలేకు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో క్షణక్షణం ఓటింగ్ లెక్కలు మారిపోతున్నాయి. సీజన్ 9 టైటిల్ రేసులో తనూజ, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యూయేల్ మధ్య పోటా పోటీగా ఓటింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తనూజ, కళ్యాణ్ మధ్య తక్కువ ఓటింగ్ డిఫరెన్స్ ఉన్నట్లు సమాచారం. అటు తనూజ, ఇటు కళ్యాణ్ ఫ్యాన్స్ తగ్గేదేలే అన్నట్లుగా ప్రమోట్ చేస్తూ తమ కంటెస్టెంట్లను గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. నిన్నటి వరకు తనూజ అత్యధిక ఓటింగ్ తో టాప్ లో ఉండగా.. ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. అనుహ్యంగా ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ ఇద్దరూ టాప్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియా లెక్కల ప్రకారం అటు తనూజ తోపాటు ఇమ్మూ, కళ్యాణ్ ఇద్దరికీ ఓటింగ్ పెరిగినట్లు సమాచారం. ఇక రీసెంట్ 100వ ఎపిసోడ్ తో ఓటింగ్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ముందు నుంచి టైటిల్ రేసులో సై అంటున్న తనూజ, కళ్యాణ్ ఇద్దరికీ పోటీగా దూసుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్. డిసెంబర్ 18 నాటి ఎపిసోడ్ లో ఇమ్మూ జర్నీ వీడియో వేరేలెవల్. మొదటి నుంచి తన ఆట తీరు, కామెడీతో అలరించిన ఇమ్మూ.. ప్రతి చోట తన మాట, ఆటతో కట్టిపడేశాడు. దీంతో ఇప్పుడు ఇమ్మూ ఓటింగ్ మారిపోయినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు కాబోతున్నారనేది ఉత్కంఠగా మారిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AIతో అసభ్యంగా చిత్రీకరిస్తే వదలను! హీరోయిన్ హెచ్చరిక
రాజాసాబ్ ఈవెంట్ పై.. పోలీసులు సీరియస్
ఈసారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన నిఖిల్..
Taapsee Pannu: జుట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలతో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చిన తాప్సీ
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కొత్తగా పుట్టిన కొడుకే వారసుడని షాకింగ్ ప్రకటన
