Ritu Choudhary: భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

Updated on: Dec 05, 2025 | 1:06 PM

బిగ్‌బాస్ సీజన్ 9లో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేందుకు కళ్యాణ్, ఇమ్మానుయేల్ తీవ్రంగా పోటీపడ్డారు. కళ్యాణ్ వరుస విజయాలతో దూసుకుపోగా, రీతూ చౌదరి అతని దూకుడుకు బ్రేకులు వేసింది. 'సాహసం చేయరా డింభకా' టాస్క్‌లో రీతూ గెలిచి, భరణిని రేసు నుంచి తప్పించింది. దీంతో కళ్యాణ్ ఆశలు గల్లంతవగా, ఫస్ట్ ఫైనలిస్ట్ రేసులో రీతూ కీలక పాత్ర పోషించింది. చివరికి విజయం ఎవరిదో తెలియాల్సి ఉంది.

బిగ్‌బాస్ సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేందుకు కళ్యాణ్-ఇమ్మానుయేల్ పోటాపోటీగా ఆడుతున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ వరుస టాస్కుల్లో విజయం సాధించి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేందుకు దగ్గరగా ఉన్నాడు. ఈ క్రమంలోనే కళ్యాణ్‌ దూకుడికి రీతూ బ్రేకులు వేసింది. రీసెంట్ ఎపిసోడ్‌లో సుమన్ శెట్టిని రేసు నుంచి తప్పిస్తూ కళ్యాణ్ గెలిచాడు. అయితే ఆల్ ఆఫ్ సడెన్‌గా ఆఖరి ఛాలెంజ్ విసిరాడు బిగ్ బాస్. కళ్యాణ్-రీతూ-ఇమ్మానుయేల్ మధ్య ఈ చివరి ఛాలెంజ్ పెట్టారు. సాహసం చేయరా డింభకా.. అనే ఈ టాస్కుకి తనూజ సంచాలక్‌గా ఉంది. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా చూడకూడదు అనుకుంటున్న పోటీదారుల స్టిక్‌పై కాయిన్స్, టోకెన్స్‌ని యాడ్ చేయాలి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఇందులో ముందుగా రీతూకి సుమన్, ఇమ్మూకి భరణి, కళ్యాణ్‌కి సంజన.. కాయిన్స్ యాడ్ చేశారు. ఒకవేళ కాయిన్స్ కానీ టోకెన్స్ కానీ కిందపడితే వాళ్లు ఛాలెంజ్‌లో ఓడినట్లే. ఆ తర్వాత ఇమ్మూకి డీమాన్.. కళ్యాణ్‌కి సుమన్.. కాయిన్స్ యాడ్ చేశారు. అయితే ఈ టాస్కులో రీతూ చౌదరి గెలిచినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రీతూ.. భరణిని ఛాలెంజ్ చేసింది. ఆ ఛాలెంజ్‌లో కూడా రీతూ గెలవడంతో భరణి ఫస్ట్ ఫైనలిస్ట్ రేసు నుంచి ఔట్ అయిపోయాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు?

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక్‌

Published on: Dec 05, 2025 01:06 PM