ఖాళీ కడుపుతో ఇవి తింటే..యవ్వనంగా కనిపిస్తారు..
అంజీర్.. దీనినే అత్తిపండు అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీని రుచి తినేందుకు తియ్యగా ఉంటుంది. దీనిని సీజన్‌తో పనిలేకుండా అన్ని కాలాల్లో తినొచ్చు. అత్తిపండు అనేక వ్యాధులను నివారిస్తుంది. ఎండిన అంజీర పండ్లను నీటిలో నానబెట్టి తింటే రెట్టింపు ఫలితాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం.అంజీర పండ్లను తరచూ తీసుకోవటం వల్ల రక్తపోటు, వృద్ధాప్యాన్ని నియంత్రిస్తుంది. అత్తి పండ్లు బరువు నిర్వహణలో సహాయపడుతాయి. గుండెకి మేలు చేసే ఆరోగ్యకరమైన ఆహారం అంజీర. అంజీర క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది కనుక షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా తినవచ్చు.
అంజీర ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్య వున్నవారు అత్తి పండ్లను తింటే సమస్య తగ్గుతుంది. మూత్రపిండాల్లో రాళ్లను సైతం అంజీర పండు కరిగిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు వీటిని కొద్ది మొత్తంలో తినవచ్చు. వీటివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. ఇక అంజీర్‌లో జింక్, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్త్రీలలో సంతానోత్పత్తిని పెంచడంలోనూ చక్కగా సహాయపడుతుంది. మెనోపాజ్ తర్వాత ఎదురయ్యే చాలా సమస్యలను అంజీర తినడం వల్ల తగ్గుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నానబెట్టిన అంజీర్ పండ్లని తినడం వల్ల శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులకి చాలా మంచిదంటున్నారు. అంజీర్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పొటాషియం బ్లడ్ షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌ని నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, ఇందులోని ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్, ఫినాల్ గుండె ఆరోగ్యానికి మంచిది. అంజీర పండ్లని రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలి. అలాగే, ఆ నీటిని తాగితే శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ కూడా ఉన్నాయి. అంజీర్ పండ్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. దీనివల్ల చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.