15 ఏళ్ల బంధానికి ముగింపు.. మరో బాలీవుడ్ జంట విడాకులు !!

|

Apr 29, 2023 | 9:30 AM

ఇటీవల చాలామంది సెలబ్రిటీల జీవితాల్లో విడాకులు కామ‌న్ అయిపోయింది. స‌మంతా - నాగ చైత‌న్య జంట‌, ఆ త‌ర్వాత ధ‌నుష్ జంట‌తో పాటు ప‌లువురు ప్రముఖులు విడాకులు తీసుకున్నారు. ఇక మెగా ఫ్యామిలిలో విడాకుల విష‌యాలు కూడా తెగ వైర‌ల్ అయ్యాయి.

ఇటీవల చాలామంది సెలబ్రిటీల జీవితాల్లో విడాకులు కామ‌న్ అయిపోయింది. స‌మంతా – నాగ చైత‌న్య జంట‌, ఆ త‌ర్వాత ధ‌నుష్ జంట‌తో పాటు ప‌లువురు ప్రముఖులు విడాకులు తీసుకున్నారు. ఇక మెగా ఫ్యామిలిలో విడాకుల విష‌యాలు కూడా తెగ వైర‌ల్ అయ్యాయి. ఇక బాలీవుడ్‌లో మరో జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బర్క బిష్త్‌, ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. వీరిద్దరూ ఎప్పటికైనా కలిసిపోతారని అనుకుంటున్న సమయంలో శాశ్వతంగా విడిపోవాలని నిశ్చయించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాము విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది బర్క. ‘అవును, మేము విడాకులు తీసుకుంటున్నాం. త్వరలోనే అందుకు సంబంధించిన పత్రాలు వచ్చేస్తాయి. నా జీవితంలో తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయమిదే! నేను ఇప్పుడు సింగిల్‌ మదర్‌ను. నా కూతురు మీరాయే నా సర్వస్వం. టీవీ, సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేసేందుకు సిద్ధం’ అని చెప్పుకొచ్చింది బర్క.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ramabanam: వివాదంలో రామబాణం ఐఫోన్ పిల్ల సాంగ్..

Samantha Temple: ఏపీలో ప్రారంభమైన సమంత టెంపుల్‌.. ఘనంగా పుట్టిన రోజు వేడుకలు

Published on: Apr 29, 2023 09:30 AM