కాంట్రవర్శీకి రెహమాన్ ఫుల్‌స్టాప్ పెట్టేసినట్టేనా ?? అసలు ఏం జరిగింది
ఎ.ఆర్.రెహమాన్ ఇటీవల బాలీవుడ్‌లో ఎదుర్కొన్న వివాదంపై స్పష్టతనిచ్చారు. మతపరమైన వివక్ష లేదని చెబుతూనే, తమిళ కళాకారులపై సాంస్కృతిక పక్షపాతం ఉందని అంగీకరించారు. హిందీ రాకపోవడం, అవకాశాలపై వచ్చిన కామెంట్‌లకు ఆయన వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, భారతీయుడిగా గర్వపడతానని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగులో 'పెద్ది' సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఎప్పుడూ పెదవివిప్పి మాట్లాడని వారు, ఉన్నట్టుండి కాంట్రవర్శీల్లో ఇరుక్కున్నప్పుడు అందరి దృష్టీ అటుగా మళ్లుతుంది. ఇప్పుడు ఎ.ఆర్.రెహమాన్ విషయంలోనూ అదే జరిగింది. ఆ మధ్య భార్యతో విడాకులు తీసుకుంటున్నానని ప్రకటించిన తర్వాత.. మళ్లీ సినిమాలతో తప్ప, మరే రకంగానూ వార్తల్లోకి రాలేదు రెహమాన్. కానీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఇంతకీ అసలేం జరిగింది? మనం చెప్పాలనుకున్న విషయాన్ని కొన్నిసార్లు ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుందని ఇప్పడు తనకు అర్థమైందని చెబుతున్నారు రెహమాన్. ఈ దేశం అందరికీ భావప్రకటనా స్వేచ్ఛ ఇచ్చిందని, భారతీయుడిగా తాను గర్వపడతానని రెహమాన్ చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌లో అవకాశాలు, మతపరమైన వివక్ష గురించి తాను చేసిన కామెంట్స్ వివాదాస్పదం కావడంతో AR రెహమాన్ వివరణ ఇచ్చుకున్నారు. తమిళ సమాజానికి చెందిన కళాకారులపై బాలీవుడ్‌లో సాంస్కృతిక పక్షపాతం ఉందన్నది రెహమాన్ ప్రస్తావించిన విషయం. మతపరంగా తాను ప్రత్యేకంగా వివక్షను అనుభవించలేదని చెబుతూనే, మత ప్రస్తావన చేశారన్నది ప్రధానంగా చర్చలోకి వచ్చిన విషయం. హిందీ రాకపోవడం వల్ల తాను బాలీవుడ్‌లో పూర్తిగా కలిసి పోలేకపోయానన్నది కూడా ఆయన చెప్పిన మాట. బాలీవుడ్‌లో అవకాశాల కోసం తానేం వెతకడం లేదని చెబుతూనే, హిందీ మ్యూజిక్ ఇండస్ట్రీని అర్థం చేసుకోవడానికి తాను సుదీర్ఘ ప్రయాణం చేశానన్నారు రెహమాన్. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు హిట్ సినిమాలు చేసిన రెహమాన్‌కి ఇప్పుడు రామాయణలాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. మ్యూజిక్‌లో తగ్గిన క్వాలిటీ, డెడ్‌లైన్స్ మీట్ కాకపోవడం వంటి పలు అంశాల కారణంగా రెహమాన్‌కి నార్త్ లో అవకాశాలు తగ్గాయన్నది గట్టిగా వినిపిస్తున్న మాట. అయితే లేటెస్ట్ గా రెహమాన్ రిలీజ్ చేసిన వీడియోతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. ఆయన ప్రస్తుతం తెలుగులో పెద్ది సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trivikram Srinivas: ట్రిపుల్ ఆర్ హీరోలతో గురూజీ.. ప్లానింగ్ పెద్దదే
తమ్ముడిని మించిన అన్న.. అదరహో అనిపిస్తున్న వరప్రసాద్ రికార్డులు
Sreeleela: శ్రీలీల భారీ ప్లానింగ్.. టాలీవుడ్‌కి దూరమవుతున్నారా
కటౌట్‌తో పనేంటి ?? కంటెంట్ ఉంటే చాలు.. హిట్టు పక్కా
Mahesh Babu: వారణాసి తర్వాతేంటి ?? సస్పెన్స్ లో సూపర్‌స్టార్ నెక్స్ట్ సినిమా