కమల హారిస్ గెలుపుకోసం.. ఏఆర్ రెహ్మాన్ పాటలు

|

Oct 14, 2024 | 8:05 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత వైఎస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు మద్దతుగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ రంగంలోకి దిగారు. హారిస్‌కు మద్దతుగా 30 నిమిషాల వీడియోను ఆయన రికార్డ్ చేశారు. దీంతో హారిస్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్న తొలి దక్షిణాసియా కళాకారుడిగా నిలిచారు. ఏఆర్ రెహ్మాన్ మద్దతుతో నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ గెలుపు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత వైఎస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు మద్దతుగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ రంగంలోకి దిగారు. హారిస్‌కు మద్దతుగా 30 నిమిషాల వీడియోను ఆయన రికార్డ్ చేశారు. దీంతో హారిస్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్న తొలి దక్షిణాసియా కళాకారుడిగా నిలిచారు. ఏఆర్ రెహ్మాన్ మద్దతుతో నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ గెలుపు అవకాశాలు మరింత మెరుగవుతాయని భావిస్తున్నారు. అమెరికా పురోగతి కోసం ఇప్పటికే నిలబడిన నాయకులు, కళాకారుల బృందానికి ఈ ప్రదర్శన ద్వారా ఏఆర్ రెహ్మాన్ తన స్వరాన్ని కలిపినట్టు అయిందని ఏషియన్‌ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ AAPI విక్టరీ ఫండ్ చైర్‌పర్సన్ శేఖర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ఏఆర్ రెహ్మాన్ వీడియో రికార్డింగ్‌పై మాట్లాడుతూ… ఏఆర్ రెహ్మాన్ ప్రదర్శన సంగీత కార్యక్రమం మాత్రమే కాదనీ అమెరికా కోసం దక్షిణాసియా సమూహాలు ఓటు వేయాలన్న పిలుపు కూడా అని నరసింహన్ అన్నారు. కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏఆర్ రెహ్మాన్ రూపొందించిన 3 నిమిషాల వీడియోను అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. ఏఏపీఐ విక్టరీ ఫండ్ యూట్యూట్ ఛానల్‌లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై శ్రుతిహాసన్‌ ఫైర్‌.. ఏం జరిగిందంటే ??

అమ్మవారి విగ్రహానికి చెమట్లు జంగారెడ్డి గూడెంలో వింత