చిరంజీవికి ఏపీ సర్కార్ లడ్డూలాంటి న్యూస్
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. సంక్రాంతి రిలీజ్‌కు ముందు జనవరి 11న రూ.500తో ప్రీమియర్ షోకు, 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు, మొదటిరోజు 5 షోలకు అనుమతిస్తూ జీఓ జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లలో ₹100, మల్టీప్లెక్స్‌లలో ₹125 అదనంగా వసూలు చేయవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ మూవీ టీంకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మన శంకర వర ప్రసాదు గారు సినిమా టికెట్ ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ప్రీమియర్ షోకు జీఎస్టీతో కలిపి 500రూపాయలువసూలు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. జనవరి 11న రాత్రి 8గంటల నుంచి 10లోపు ఈ షోలు ఉంటాయని జీవీలో పేర్కొంది. అంతేకాదు రిలీజ్ డే నుంచి పదిరోజులపాటు టికెట్ ధరలను పెంచుకోవచ్చని కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరపై జీఎస్టీతో కలిసి 100 రూపాయలను.. మల్టీప్లెక్స్‌లలో జీఎస్టీతో కలిపి 125 రూపాయలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. విడుదల మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5 షోలు ప్రదర్శించవచ్చని చిరు సినిమాకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: మాట నిలబెట్టుకున్న మెగాస్టార్ చిన్నారికి మెగా సాయం
The Raja Saab Collection: టాక్ సంగతి పక్కకు పెడితే… రాజాసాబ్‌కు డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
The Raja Saab: ధురంధర్ రికార్డ్ బద్దలుకొట్టిన రాజాసాబ్
RGV: చిన్న పిల్లలు కూడా ఏదైనా చూడగలుగుతున్నారు కదా.. సెన్సార్ బోర్డ్ పై RGV బిగ్ పంచ్
