బిగ్ బాస్‌ షోపై సీరియల్ నటి సంచలన కామెంట్స్

Updated on: Oct 25, 2025 | 11:43 AM

బిగ్‏బాస్ సీజన్ 9.. షోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే పేరుకే తెలుగు షో అయినప్పటికీ అందులో పాల్గొంటుంది మాత్రం మొత్తం ఇతర భాష నటీనటులే. ఇప్పటికే అన్ని సీజన్స్ లోనూ ఇతర భాషా నటీనటులు పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ సీజన్‌లో కూడా ఎక్కువగా నాన్ తెలుగు వాళ్లనే తీసుకొచ్చారు షో నిర్వాహకులు.

ప్రస్తుతం సీజన్ 9లో ఉన్న కంటెస్టెంట్లలో సంజనా, గౌరవ్, నిఖిల్, తనూజ.. ఇప్పటికే ఎలిమినేట్ అయిన శ్రష్టి వర్మ, ఫ్లోరా షైనీ.. వీళ్లందరూ తెలుగువాళ్లు కాదు. అయితే తెలుగు రియాల్టీ షోలో తెలుగు వాళ్ల కంటే ఇతర భాషా కంటెస్టెంట్స్ ఎక్కువగా ఉండడాన్ని ఇప్పటికే చాలా మంది విమర్శించారు. ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటి నర్మదా అలియాస్ అన్షురెడ్డి కూడా బిగ్ బాస్‌ రియాల్టీ షోపై సంచలన కామెంట్స్ చేశారు. షోలో నాన్ తెలుగు వాళ్లే ఎక్కువగా ఉండడంపై సీరియస్ అయ్యారు. పేరుకు తెలుగు రియాల్టీ షో.. కానీ అందులోకి తెలుగు సరిగా మాట్లాడటం రాని చాలా మంది నాన్ తెలుగు నటీనటులే ఉన్నారు. అసలు నాన్ తెలుగు వాళ్లను ఎందుకు తీసుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు బుల్లితెర నటి నర్మదా. అంతేకాదు తెలుగు మాట్లాడటం, అర్థం చేసుకోవడం అనేది తెలుగు బిగ్‏బాస్ షోలో ప్రాథమిక ప్రమాణం. బిగ్‏బాస్ లోకి వెళ్లాలని చాలా మంది తెలుగు నటీనటులు ఉన్నారు. కానీ వారికి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇతర భాషలలో కూడా బిగ్‏బాస్ షో ఉంది.. అక్కడ తెలుగు వాళ్లకు ఎంత మందికి అవకాశం ఇస్తున్నారు ? సీరియల్స్, సినిమాల విషయంలో కూడా ఇదే పరిస్థితి. తెలుగు రాకపోయినా తెలుగు బిగ్‏బాస్ రియాల్టీ షోలో మైక్ ఉంటుంది. స్క్రిప్ట్ ఉండదు..వీళ్లు ఎప్పుడు మారతారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అన్షు రెడ్డి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాన్వీకపూర్‌కు అండాదండా ఆయనేనా

Diwali: టపాసుల్లా కార్బైడ్ గన్‌ను పేల్చి .. కంటి చూపు కోల్పోయిన 14 మంది

కళ్యాణమండపానికి వచ్చిన అనుకోని అతిథి

వ్యాపారులకు దొంగబాబాల బురిడీ.. పౌడర్‌ చల్లి.. డబ్బుతో పరార్‌

మహిళలకు ఆన్‌లైన్ ఉగ్రవాద కోర్సు

Published on: Oct 25, 2025 11:36 AM