Triptii Dimri: ఒకే ఒక్క సినిమా.. దెబ్బకు కోట్లలో ఆస్తిని కొనుగోలు చేసిన హీరోయిన్.

|

Jun 11, 2024 | 10:05 AM

ఒకే ఒక్క సినిమాతో నేషనల్ క్రష్‏గా మారిపోయింది హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాతో ఒకేసారిగా ఫేమస్ అయ్యింది. అందం, అభినయం, గ్లామర్ తో కట్టిపడేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చిన ఈ తార.. విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకుంది. కానీ యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

ఒకే ఒక్క సినిమాతో నేషనల్ క్రష్‏గా మారిపోయింది హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాతో ఒకేసారిగా ఫేమస్ అయ్యింది. అందం, అభినయం, గ్లామర్ తో కట్టిపడేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చిన ఈ తార.. విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకుంది. కానీ యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామేతను చక్కగా ఫాలో అవుతూ ముంబయ్‌లో కాస్త గట్టిగానే ఆస్తులు కూడబెడుతోందట ఈబ్యూటీ.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న త్రిప్తి.. ముంబైలో సెలబ్రెటీలు ఉండే బాంద్రా ఏరియాకు తన మకాం మార్చేసింది. ముంబైలో రణబీర్ కపూర్, అలియా భట్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలు నివసించే బాంద్రా ఏరియాలో రెండంతస్తుల బంగ్లాను కొనేసిందట. సుమారు 247 గజాల విస్తీర్ణంలో ఉన్న ఆ ఇళ్లు ధర 14 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక త్రిప్తి డిమ్రి ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. కెరీర్ బిగినింగ్‌లో కొన్ని సినిమాలు చేసింది. కానీ బుల్ బుల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ సినిమా తర్వాత వచ్చిన యానిమల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ బ్యూటీగా మారింది ఈ బ్యూటీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.