ButtaBomma Pre-Release Event: బుట్టబొమ్మ కోసం వచ్చిన టిల్లు.. ఇక మోతమోగాల్సిందే..(లైవ్)
బాలనటిగా ఇప్పటికే దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయిన వారిలో అనిక సురేంద్రన్ ఒకరు. తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్, నయనతార నటించిన విశ్వాసం సినిమాలో అజిత్ కూతురిగా కనిపించి మెప్పించింది అనిక.
బాలనటిగా ఇప్పటికే దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయిన వారిలో అనిక సురేంద్రన్ ఒకరు. తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్, నయనతార నటించిన విశ్వాసం సినిమాలో అజిత్ కూతురిగా కనిపించి మెప్పించింది అనిక. ఈ మూవీతో అటు తమిళనాడులోనే కాదు.. ఇటు తెలుగు ప్రేక్షకుల మనసులలోనూ చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు ఈ చిన్నారి హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతుంది. ఆమె కథానాయికగా నటిస్తోన్న చిత్రం బుట్టబొమ్మ. ఈ ఫీల్ గుడ్ రూరల్ డ్రామాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో అనికతోపాటు.. సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..