Naveen Polishetty: రూ.100 కోట్ల ఆనందంలో.. నవీన్ భావోద్వేగం

Updated on: Jan 21, 2026 | 7:13 PM

నవీన్ పొలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' చిత్రం సంక్రాంతికి విడుదలై వంద కోట్ల క్లబ్‌లో చేరి భారీ విజయం సాధించింది. ఈ అనూహ్య సక్సెస్ పట్ల నవీన్ పొలిశెట్టి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రేక్షకులకు, నిర్మాత నాగవంశీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ విజయం కోసం చాలా కష్టపడ్డానని, భవిష్యత్తులోనూ ప్రేక్షకులను అలరించడానికి మరింత కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

దాదాపు రెండున్నరేళ్ల తర్వాత.. చాలా ఇష్టపడి.. కాలం కలిసిరాకున్నా చాలా కష్టపడి.. నవీన్ పొలిశెట్టి చేసిన సినిమా అనగనగా ఒక రాజు. సంక్రాంతి కానుకగా.. ముగ్గురు పెద్ద హీరోల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్‌ బిగ్ హిట్ అయిపోయింది. దిమ్మతిరిగే కలెక్షన్స్‌తో అందర్నీ స్టన్‌ అయ్యేలా చేస్తోంది. రీసెంట్‌గా వంద కోట్ల మార్క్‌ను కూడా అందుకుంది. ఈ క్రమంలోనే హీరో నవీన్ పొలిశెట్టి ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్‌లోనే.. ఈ రేంజ్‌ కలెక్షన్స్‌ రావడంపై ట్వీట్ చేశారు. నవీన్ పొలిశెట్టి హీరోగా మారి డైరెక్షన్లో తెరకెక్కిన అనగనగా ఒక రాజు సినిమా.. రిలీజైన ఐదు రోజుల్లోనే వంద కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో నవీన్ పొలిశెట్టి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోయిందని నవీన్‌ రాసుకొచ్చారు. ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపాడు. ఈ క్షణం కోసం చాలా సంవత్సరాలు పట్టిందని ఎమోషనల్ అయ్యాడు. అంతేకాఆదు ఈ బ్లాక్‌బస్టర్ అందించిన తన నిర్మాతలకు నవీన్ పొలిశెట్టి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రోత్సహించడం.. మద్దతుగా నిలవడం.. ఊపిరిని ఇచ్చినట్టైందంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఈ విజయం మనందరిది. మీ ప్రేమ, మద్దతు ఇలాగే అందిస్తూ ఉండండి. మీకు మరింత వినోదాత్మక చిత్రాలను అందించడానికి నేను మరింత కష్టపడతా’ అంటూ తన ట్వీట్‌లో కోట్ చేశాడు నవీన్ పొలిశెట్టి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌లో.. మెగాస్టార్ ఆల్ టైం రికార్డ్‌

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం అమ్మినరోజే నగదు

భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా వేసాడు

ప్రయోజకుడై వచ్చిన కొడుకు.. కూరగాయలు అమ్ముకునే తల్లి రియాక్షన్

ఈ ఏడాది ట్రావెన్‌కోర్‌ బోర్డుకు రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలుసా?