అర్హ క్యూట్ వీడియో.. అన్నయ్య‌ల‌కు రాఖీ కట్టి.. కాళ్లకు మొక్కిన బన్నీ త‌న‌య‌

Updated on: Aug 13, 2025 | 6:03 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న‌య అల్లు అర్హ వీడియోలు నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. ఫన్నీ బెస్ట్ మోమెంట్స్ అయితే సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంటాయి. తన తండ్రితో సరదాగా గడిపిన క్షణాలు, క్యూట్ డైలాగ్స్ బన్నీ లేదా స్నేహా రెడ్డిలు త‌మ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుండ‌డంతో అవి నెటిజ‌న్స్‌తో పాటు బ‌న్నీ అభిమానుల‌ని అల‌రిస్తుంటాయి.

అర్హ త‌న తండ్రితో కలిసి ప‌లు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. శాకుంతలం సినిమాలో బాలనటిగా అల‌రించింది. స్నేహా రెడ్డి త‌న‌ ఇద్దరు పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. పండగలు, ఫంక్షన్స్ ఫోటోలు మాత్రం మిస్ కాకుండా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా స్నేహా రెడ్డి అల్లు వారి ఇంట జరిగిన రాఖీ వేడుకలను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు. అన్న అయాన్ కు అర్హ రాఖీ కట్టడం, ఆ త‌ర్వాత అల్లు వారసులకు రాఖీలు కట్టి వారి ఆశీర్వాదం తీసుకోవ‌డం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ క్యూట్ వీడియో ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆక‌ట్టుకుంటోంది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. అయితే కేవలం పిల్లల రాఖీ సెలబ్రేషన్స్ మాత్రమే చూపించిన స్నేహా రెడ్డి. మ‌రి బన్నీ ఎవరి చేత రాఖీ కట్టించుకున్నాడు అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంచారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కిరాతకంగా చంపి డెడ్‌ బాడీస్‌తో ఇల్లు కట్టుకోవడం ఏంట్రా? దిమాక్ ఖరాబ్ సినిమా..! బట్‌ ఫుల్ థ్రిల్‌!

గుడ్‌న్యూస్‌.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే

తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌