Allur Arjun: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం !! లండన్ మ్యూజియంలో మైనం విగ్రహం
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం దక్కినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో అతడి మైనపు విగ్రహం కొలువుదీరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్తను అతడి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ విగ్రహానికి సంబంధించిన కొలతలు ఇవ్వడం కోసం బన్నీ లండన్‌కు వెళ్లనున్నారట.
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం దక్కినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో అతడి మైనపు విగ్రహం కొలువుదీరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్తను అతడి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ విగ్రహానికి సంబంధించిన కొలతలు ఇవ్వడం కోసం బన్నీ లండన్‌కు వెళ్లనున్నారట. ఇదే నిజమైతే ఈ ఘనత సాధించిన మరో దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ నిలుస్తాడు. ఈ వార్తతో బన్నీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ప్రభాస్, మహేశ్‌బాబు మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇక సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప.. ది రైజ్ తో బన్నీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప.. ది రూల్ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ మొక్క నాటితే పిల్లలు పుట్టడం ఖాయం !!
దేశంలోనే రిచెస్ట్ గణపతి.. ఏకంగా కోట్లలో బీమా !!
అలిపిరిలో దొరికిన చిరుతలకు విముక్తి !! మరో చిరుతను విశాఖపట్నం ఇందిరా గాంధీ జూ పార్క్ కు తరలింపు
గిరిజనులను గడగడలాడిస్తున్న గజరాజులు.. అటవీ అధికారి మృతి
Birth Certificate: అక్టోబర్ 1 నుంచి బర్త్ సర్టిఫికేట్ కొత్త రూల్స్ !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

