Allu Arjun: వర్చువల్‌గా నాంపల్లి కోర్టు ముందుకు అల్లు అర్జున్..  విచారణ వాయిదా..
Allu Arjun

Allu Arjun: వర్చువల్‌గా నాంపల్లి కోర్టు ముందుకు అల్లు అర్జున్.. విచారణ వాయిదా..

|

Dec 27, 2024 | 2:05 PM

నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అల్లుఅర్జున్. అల్లు అర్జున్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది కోర్టు. అలాగే నేటితో 14 రోజుల రిమాండ్ గడువు ముగింది. ఇప్పటికే హైకోర్టు నుంచి బెయిల్ పొందారు అల్లు అర్జున్. ఈ క్రమంలో నాంపల్లి కోర్టు ముందు వర్చువల్‌గా హాజరయ్యారు అల్లు అర్జున్ .  కాగా కేసు విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేసింది కోర్టు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు డిసెంబర్‌ 13న 14 రోజుల రిమాండ్‌ విధించింది నాంపల్లి కోర్టు. దీనిపై అల్లు అర్జున్ తరపున అడ్వొకేట్లు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు, క్వాష్‌ పిటిషన్ దాఖలు చేశారు. వాదనల అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అదే రోజు బెయిల్ వచ్చినా మర్నాడు ఉదయం చంచల్‌గూడ నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్‌ ఇవాళ్టితో ముగిసింది. . బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరారు. దీంతో నాంపల్లి కోర్టు విచారణను సోమవారానికి (డిసెంబరు 30) వాయిదా వేసింది. మరోవైపు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో విచారణనూ నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 10వ తేదీన చేపట్టనున్నట్లు వెల్లడించింది. 

Published on: Dec 27, 2024 11:17 AM