AA22: ఏఏ 22 అప్‌డేట్.. బన్నీ కన్ఫార్మ్ చేసినట్టేనా ??
ఈ మధ్య ఇండియన్ స్క్రీన్ మీద కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. అఫీషియల్ అప్‌డేట్ ఇవ్వకుండానే అన్ని ఓపెన్ చేసేందుకు మేకర్స్. సినిమా యూనిట్‌కు సంబంధించి క్లియర్ క్లారిటీ ఇవ్వకుండా హింట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఎంగేజ్ చేస్తున్నారు. తాజాగా ఏఏ 22కు సంబంధించి అలాంటి అప్‌డేటే ఇచ్చారు ఐకాన్ స్టార్. పుష్ప 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత ఓ గ్లోబల్ మూవీని లైన్‌లో పెట్టారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒకే ఒక్క అఫీషియల్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకోన్ నటించబోతున్నారని. మరికొంత మంది హీరోయిన్ల పేర్లు తెర మీదకు వచ్చిన అఫీషియల్‌గా మాత్రం కన్ఫార్మ్ చేయలేదు. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ చాలా రోజులుగా ఓ పేరు వైరల్ అవుతున్నా.. మేకర్స్ సైడ్ నుంచి అఫిషియల్ క్లారిటీ రాలేదు. అయితే ఈ సంగీత దర్శకుడి విషయంలో బన్నీ ఓ హింట్ ఇచ్చారు. మంగళవారం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ పుట్టిన రోజు సందర్భంగా అతడికి విషెస్ చెప్పారు బన్నీ. చాలా రోజులుగా అభ్యంకరే ఏఏ 22 సంగీత దర్శకుడన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బన్నీ కూడా విషెస్ చెప్పటంతో ఆ న్యూస్ కన్ఫార్మ్ అయినట్టే అని భావిస్తున్నారు ఫ్యాన్స్. మ్యూజిక్ సింగిల్స్‌తో పాపులర్ అయిన సాయి అభ్యంకర్, ఇప్పుడు సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిషియన్‌గా ఉన్నారు. ఈ యంగ్ మ్యూజిషియన్ కంపోజ్ చేసిన రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ అయినా… అప్ కమింగ్ లిస్ట్‌లో మాత్రం క్రేజీ ప్రాజెక్ట్స్ ఊరిస్తున్నాయి. అందులో ఏఏ 22 కూడా ఉందన్నది ట్రెండింగ్ టాపిక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. రన్‌వే అవసరం లేని విమానం
టెన్త్ అర్హతతో రైల్వే ఉద్యోగం.. రాత పరీక్ష లేకుండానే
అయ్యో..రక్షించేవారే లేరా.. ఏనుగుల ఆక్రందన