Akshay Kumar: ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాదు క్షతగాత్రులకు సాయం చేసిన స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ముంబైలో ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం యాక్సిడెంట్‌కు గురైంది. వేగంగా వచ్చిన మెర్సిడెస్ కారు ఆటోను ఢీకొట్టి, ఆటో అక్షయ్ వాహనాన్ని తాకింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. వెంటనే అక్షయ్, ట్వింకిల్ ఖన్నా స్పందించి, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. తన ఉదార స్వభావంతో మరోసారి హీరో అనిపించుకున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. తన 25th మ్యారేజ్ యానివర్సరీ కారణంగా.. వెకేషన్‌కు వెళ్లిన అక్షయ్.. జనవరి 19న రాత్రి ముంబయ్‌లో ల్యాండ్ అయ్యారు. ఈక్రమంలోనే.. తన అక్షయ్ ఇంటికి వెళుతుండగా.. తన కాన్వాయ్‌లోని ఓ వెహికిల్ ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి వచ్చి అతివేగంగా వచ్చిన ఓ మెర్సిడేజ్ ఎలక్ట్రిక్ వెహికిల్ అదుపు తప్పి.. ఆటోను ఢీకొట్టగా.. ఆ ఆటో అక్షయ్ ఎస్కార్ట్ వెహికిల్ ను ఢీకొట్టింది. దీంతో అక్షయ్ ఎస్కార్ట్ వాహనం కింద పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆటో మాత్రం నుజ్జు నుజ్జు అయింది. అందులోని ప్రయాణికులు.. డ్రైవర్ చెల్లా చెదురుగా రోడ్డు మీద పడ్డారు. ఇక తన కారు వెనక జరిగిన ప్రమాదాన్ని గుర్తించిన అక్షయ్, ట్వింకిల్ ఖన్నా.. కార్ నుంచి దిగి.. క్షతగాత్రులకు సాయం చేశారు. ఆలస్యం అనేది లేకుండా తన మరో వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఈ పనితో మరో సారి హీరో అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. స్టార్ హీరో అక్షయ్ కుమార్.. ప్రజెంట్ ‘బూత్ బంగ్లా’, ‘వెల్కమ్ టూ ద జంగల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలతో పాటే ‘వీల్ ఆఫ్ ఫార్చూన్’ పేరుతో షో చేస్తున్నారు ఈ స్టార్ హీరో.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: ‘మీరు లేనిదే.. నేను లేను’ మెగాస్టార్ ఎమోషనల్
Naveen Polishetty: రూ.100 కోట్ల ఆనందంలో.. నవీన్ భావోద్వేగం
Chiranjeevi: బాక్సాఫీస్ కలెక్షన్స్‌లో.. మెగాస్టార్ ఆల్ టైం రికార్డ్
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం అమ్మినరోజే నగదు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా వేసాడు
