Boyapati Sreenu: ట్రోల్స్ పై బోయపాటి రియాక్షన్.. ఆల్రెడీ హమ్‌నే కాషన్ కీయ

Updated on: Dec 23, 2025 | 1:00 PM

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2 – తాండవం’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ రిలీజ్ చేశారు. దీని కోసం ఈ సినిమాను నార్త్‌లోనూ భారీగా ప్రమోట్ చేశారు మేకర్స్. అయితే, ఈ ప్రమోషన్స్‌లో భాగంగా బోయపాటి, బాలయ్య హిందీ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని ఓ డైలాగు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2 – తాండవం’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ రిలీజ్ చేశారు. దీని కోసం ఈ సినిమాను నార్త్‌లోనూ భారీగా ప్రమోట్ చేశారు మేకర్స్. అయితే, ఈ ప్రమోషన్స్‌లో భాగంగా బోయపాటి, బాలయ్య హిందీ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని ఓ డైలాగు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అఖండ 2 హిందీ ప్రమోషన్స్‌లో బోయపాటి చెప్పిన ‘‘ఆల్రెడీ హమ్‌నే బోల్ దియా.. కాషన్ కియా’’ డైలాగ్ వైరల్ కావడంతో మీమర్స్ దాన్ని బాగా ట్రెండ్ చేశారు. అయితే, ఇప్పుడు తనపై వచ్చిన ఈ మీమ్‌కు బోయపాటి రియాక్ట్ అయ్యారు. తాజాగా థమన్, బోయపాటి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సింగర్ సునీత ఈ వైరల్ మీమ్‌ను వినిపించారు. దీంతో తన మనసులో నుంచి వచ్చిన హిందీ భాషను మాట్లాడానని.. అందులో ఏం తప్పులేదని.. బోయపాటి కామెంట్ చేశారు. థమన్ కూడా ఈ మీమ్‌పై రియాక్ట్ అయ్యారు. ‘ఆల్రెడీ హమ్‌నే బోల్ దియా.. మైనే సౌండ్‌పై కాషన్ కియా, ఇన్హోనే సినిమాపై కాషన్ కియా’ అంటూ ఆయన రిప్లై ఇచ్చారు. దీంతో మరోసారి ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అఖండ 2 చిత్రం ప్రస్తుతం స్టెడీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర రన్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gudivada Amarnath: చంద్రబాబు పై కేసీఆర్ వ్యాఖ్యలు వంద శాతం నిజమే

Gold Price Today: మహిళలకు భారీ షాక్‌.. రాత్రికి రాత్రే పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు

Dubai: నదుల్లా మారిన దుబాయ్‌ రోడ్లు..

కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..

రెండు నెలల ఆపరేషన్‌ సక్సెస్‌.. బోనులో చిక్కిన మ్యాన్‌ ఈటర్‌