సినీ తారలను టెన్షన్ పెడుతున్న టెక్నాలజీ

Edited By:

Updated on: Dec 19, 2025 | 4:28 PM

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దుర్వినియోగం హీరోయిన్లకు తీవ్ర తలనొప్పులు తెస్తోంది. వారి వ్యక్తిగత సమాచారాన్ని, చిత్రాలను అసభ్యంగా మార్చి AI ద్వారా ప్రచారంలో పెడుతున్నారు. శ్రీలీల, రష్మిక, కీర్తి సురేష్ వంటి ప్రముఖులు ఈ అరాచకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. AIని మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలని, మహిళల భద్రతకు భంగం కలిగించరాదని స్పష్టం చేస్తున్నారు.

AI మిస్ యూజ్ దారుణంగా జరుగుతుందా..? ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లను ఇబ్బంది పెడుతున్నారా..? వాళ్ల వ్యక్తిగత విషయాలను సైతం AIతో నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారా..? తాజాగా మన హీరోయిన్స్ కోపం చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. మరో హీరోయిన్ సైతం AI మిస్ యూజ్‌పై తన గళం విప్పింది. ఎవరామె.. ఆమెకు జరిగిన నష్టమేంటి..? ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌తో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయిప్పుడు. మనుషులతో అవసరం లేకుండా ఏకంగా సినిమాలు కూడా తీస్తున్నారు.. మరోవైపు ఎన్నో అవసరాల కోసం వాడుకుంటున్నారు. కానీ అదే టైమ్‌లో AIని మిస్ యూజ్ చేస్తున్న వాళ్లు లేకపోలేదు. ముఖ్యంగా హీరోయిన్లకు ఈ టెక్నాలజీ కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతుంది. దీనిపై స్టార్స్ ఓపెన్ అవుతున్నారు. తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ దుర్వినియోగంపై శ్రీలీల ఓపెన్ అయ్యారు. AI అనేది మంచి పనుల కోసమే వాడాలి తప్ప అమ్మాయిలను అసభ్యంగా చూపించడానికి కాదు. ఆర్టిస్ట్ అయినా కూడా.. ఎవరో ఒకరికి కూతురు, సోదరి అనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు శ్రీలీల. మేం సేఫ్ ప్లేస్‌లో పని చేస్తున్నామనే ధైర్యాన్నివ్వాలని కోరారు ఈ భామ. ఈ మధ్యే రష్మిక మందన్న AI మిస్ యూజ్‌పై ఓపెన్ అయ్యారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని.. అసభ్యంగా చూపించడం, టెక్నాలజీ దుర్వినియోగం చేయడం కొంతమంది వ్యక్తులలో నైతిక పతనాన్ని సూచిస్తుంది.. ఇకపై గుర్తుంచుకోండి ఇంటర్నెట్‌లో ఉన్నది ఇకపై ప్రతీది నిజం కాదని ఈ మధ్యే ట్వీట్ చేసారు రష్మిక. రష్మిక మాత్రమే కాదు.. మొన్నటికి మొన్న కీర్తి సురేష్ సైతం AI మిస్ యూజ్ గురించి సీరియస్ అయ్యారు. అలాంటి వీడియోలు, ఫోటోలను చూస్తుంటేనే అసహ్యమేస్తుందంటూ కీర్తి మండిపడ్డారు. సాయి పల్లవి, ప్రియాంక మోహన్.. ఇంకా చాలా మంది స్టార్స్ సైతం టెక్నాలజీని సరైన పద్దతిలో వాడాలంటూ హితవు పలుకుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆస్కార్‌కు ఇండియా నుంచి ఒకే ఒక్కటి

The Raja Saab: ఫ్యాన్స్ కోసం తప్పట్లేదంటున్న ప్రభాస్

మీడియం రేంజ్ హీరోలు కూడా ఇలా చేస్తే ఎలా..?

పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన

ఎన్‌పీఎస్‌లో కీలక మార్పు రూ.8 లక్షలు విత్ డ్రా