ఏఐకి అమ్మను గుర్తు చేయండి.. లేదంటే.. అంతమే

Updated on: Aug 20, 2025 | 4:42 PM

కృత్రిమ మేధస్సు అనేది.. ఒకనాటికి మానవాళిని తుడిచి పెట్టే ప్రమాదముందని ఏఐ గాడ్‌ఫాదర్‌ జెఫ్రీ హింటన్‌ హెచ్చరించారు. ఏఐపై ఇప్పుడున్న.. మానవ ఆధిపత్యం రాబోయే రోజుల్లో తగ్గిపోతుందని ఆయన హింటన్‌ అభిప్రాయపడ్డారు. ఏఐ సిస్టమ్స్‌ మానవుల కన్నా తెలివి మీరిన నాడు.. ఇక అవి.. మనిషి మాట విననే వినవని, మనిషి తమకు విధించిన నియంత్రణలను బద్దలు కొట్టుకుని అవి బయటపడటానికి.. సరికొత్త మార్గాలను అన్వేషిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.

లాస్‌ వెగాస్‌లో జరిగిన ఏఐ4 సదస్సులో ఆయన ఏఐ భవిష్యత్ పోకడల మీద మాట్లాడారు. అదే పరిస్థితి వచ్చిన రోజు.. ఏఐని వినయ, విధేయతలు కలిగిన దానిగా ఉంచేందుకు మనిషి చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ కావటం ఖాయమని ఆయన స్పష్టం చేశాడు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత అనేవి.. మనుషుల కంటే.. ఏఐకే ఎక్కువని ఆయన ప్రకటించారు.ఈ నేపథ్యంలో.. ఏఐ సిస్టమ్స్‌కు మాతృత్వ భావనలను.. జోడించడం వల్ల మానవుల పట్ల అవి బాధ్యతగా, ప్రేమగా ఉండేలా వాటిని గైడ్ చేయవచ్చిన హింటన్ అభిప్రాయపడ్డారు. హింటన్‌ డీప్‌ లెర్నింగ్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఏఐ అంతిమంగా మానవుడి అంతానికి దారి తీసే అవకాశం 10 నుంచి 20 శాతం వరకు ఉందని గతంలోనే ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఏఐ సిస్టమ్స్‌ను కట్టుదిట్టమైన మానవ నియంత్రణ అదుపు చేయగలుగుతోందని, రాబోయే రోజుల్లో అది సాధ్యం కాకపోవచ్చని ఆయన వాదిస్తున్నారు. ఇటీవల.. ఒక ఏఐ సిస్టమ్‌ అక్కడ పనిచేసే ఇంజినీరును బెదిరించే ప్రయత్నం చేసింది. దీనిని గుర్తుచేస్తున్న హింటన్.. రాబోయే రోజుల్లో ఏఐ మోడల్స్‌ కూడా అబద్ధాలు చెప్పటం, మోసం చేయటం వంటి మానవ లక్షణాలను సంతరించుకుంటాయని, అదే జరిగితే.. ఇక వినాశనమేనని హింటన్ ఆందోళన వ్యక్తం చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మునిగిన ముంబై.. ఆర్థిక రాజధాని అతలాకుతలం

Weather Update: మరో మూడు రోజులు వానలు దంచుడే దంచుడు .. ఈ జిల్లాలకు బిగ్‌ అలర్ట్‌..

Roopchand Fish: రక్తం రుచి మరిగిన చేప.. ఇతర చేపలకు భిన్నం

పీఎం కిసాన్‌ డబ్బులు రాలేదా? అయితే ఇలా చేయండి

ప్రేమించిన అమ్మాయికి ‘బాంబు’ గిఫ్ట్‌ పార్శిల్‌ అందుకున్న భర్త.. చివరికి