Balakrishna: మరోసారి గొంతు సవరించుకుంటున్న బాలయ్య.. ఫ్యాన్స్ గెట్ రెడీ

Updated on: Dec 18, 2025 | 12:45 PM

అఖండ 2 విజయానంతరం నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు కొత్త సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. ఆయన ప్రస్తుతం ఎన్బికె111 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి గాయకుడిగా మారనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. గతంలో పైసా వసూల్ కోసం పాడిన బాలయ్య, ఇప్పుడు హై పిచ్ సాంగ్ తో అలరించనున్నారు.

అఖండ 2 విజయం తర్వాత, నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరో ఆసక్తికర వార్త అందిస్తున్నారు. ప్రస్తుతం ఎన్బికె111 సినిమా చిత్రీకరణలో నిమగ్నమైన బాలయ్య, ఈ ప్రాజెక్ట్ కోసం ఓ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇదివరకు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పైసా వసూల్ చిత్రంలో గాయకుడిగా మారిన బాలకృష్ణ, ఇప్పుడు మరోసారి పాట పాడనున్నారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వయంగా ధృవీకరించారు. ఎన్బికె111 కోసం బాలయ్య ఒక హై పిచ్ సాంగ్ ను ఆలపించనున్నారని, ఇది బాహుబలిలోని సాహోరే బాహుబలి తరహాలో ఉంటుందని తమన్ సూచించారు. బాలయ్య సింగింగ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jailer 2: జైలర్ 2లో ఆ ముద్దుగుమ్మతో స్పెషల్ సాంగ్‌.. దుమ్ము దుమారమే

చిరంజీవి వల్ల కాలేదు.. పోనీ.. బాలయ్య చేశాడా? అదీ లేదు

Rakul Preet: ప్లాస్టిక్ సర్జరీ బాడీ అంటూ ట్రోల్స్.. సీరియస్ అయిన రకుల్

Rashmika Mandanna: దోస్తులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన రష్మిక.. ఫోటోలు వైరల్

Allu Arjun: బన్నీ కోసం 1758 కిలోమీటర్ల సైకిల్ యాత్ర! తెలిసి అక్కున చేర్చున్న ఐకాన్ స్టార్

 

Published on: Dec 18, 2025 12:45 PM