Sakshi Agarwal – Atlee: ‘మోసపోయాను’ డైరెక్టర్ అట్లీ పై హీరోయిన్ సాక్షి షాకింగ్‌ కామెంట్స్.

Updated on: Feb 04, 2024 | 8:08 PM

కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ టూ పాన్ ఇండియన్ యంగ్ అండ్ డైనమిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ.. ఇప్పుడు ఉన్నట్టుండి నెట్టింట వైరల్ అవుతున్నాడు. హీరోయిన్ సాక్షి అగర్వాల్ చేసిన కామెంట్స్‌తో.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాడు. బాలీవుడ్‌ కింగ్ ఖాన్ షారుఖ్‌తో.. జవాన్‌ సినిమా చేసి.. కలెక్షన్స్‌లో వెయ్యి కోట్ల మార్కును అందుకున్న అట్లీ.. రాజా రాణి సినిమాతో.. డైరెక్టర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో మొదట తనే సెకండ్‌ హీరోయిన్‌ అంటూ.. తాజాగా ఇంటర్వ్యూలో రివీల్ చేశారు సాక్షి అగర్వాల్.

కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ టూ పాన్ ఇండియన్ యంగ్ అండ్ డైనమిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ.. ఇప్పుడు ఉన్నట్టుండి నెట్టింట వైరల్ అవుతున్నాడు. హీరోయిన్ సాక్షి అగర్వాల్ చేసిన కామెంట్స్‌తో.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాడు. బాలీవుడ్‌ కింగ్ ఖాన్ షారుఖ్‌తో.. జవాన్‌ సినిమా చేసి.. కలెక్షన్స్‌లో వెయ్యి కోట్ల మార్కును అందుకున్న అట్లీ.. రాజా రాణి సినిమాతో.. డైరెక్టర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో మొదట తనే సెకండ్‌ హీరోయిన్‌ అంటూ.. తాజాగా ఇంటర్వ్యూలో రివీల్ చేశారు సాక్షి అగర్వాల్. అప్పట్లో తాను బెంగుళూరులో మోడలింగ్ చేస్తూ ఉండగా.. ఓ కాస్టింగ్ ఏజెన్సీ రాజా రాణి సినిమాలో నటించాలంటూ తనను అప్రొచ్ అయిందని.. చెప్పింది. ఆ క్యారెక్టర్‌ సినిమాలో సెకండ్ హీరోయిన్‌ అని.. ఆర్య కూడా యాక్ట్ చేస్తున్నాడని చెప్పడంతో.. తను కూడా ఎగ్టైట్‌గా ఓకే చెప్పానంది. డైరెక్టర్ అట్లీ కూడా తన పై కొన్ని షాట్స్‌ షూట్ చేశారని.. కానీ ఉన్నట్టుండి.. తనను అవాడ్ చేశారని ఎమోషనల్ అయింది.చివరికి సినిమా రిలీజ్ అయ్యాక చూస్తూ.. తాను మోసపోయినట్టు గ్రహించానంది. తన మీద షూట్‌ చేసిన సీన్లు సినిమాలో ఉన్నప్పటికీ.. అది జూనియార్ ఆర్టిస్ట్ చేసే క్యారెక్టర్‌ మాత్రమే అంది. అయితే తాజాగా తను రివీల్ చేసిన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అట్లీని కూడా.. వైరల్ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos