మరోసారి డాన్స్‌తో అదరగొట్టిన సాయి పల్లవి..

|

Mar 15, 2025 | 12:03 PM

రీసెంట్‌గా తండేల్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సాయి పల్లవి... ఇప్పుడు నెట్టింట ఓ డ్యాన్స్ వీడియోతో తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. రీసెంట్‌గా ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో తన ఫ్యామిలీతో డ్యాన్స్‌ చేస్తూ కనిపించింది. సాయి పల్లవి డ్యాన్స్ చూసిన అభిమానులు ఆమె ఎనర్జీని ప్రశంసిస్తున్నారు.

ఇక వైరల్ వీడియోలో, నటి సాయి పల్లవి అందమైన చీరలో కనిపిస్తుంది. మ్యూజిక్ కు అనుగుణంగా డాన్స్ చేయడం అభిమానులను బాగా ఆకట్టుకుంది. గతంలో సాయి పల్లవి తన చెల్లెలు పూజా పెళ్లిల్లోనూ డాన్స్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మరోసారి సాయి పల్లవి డాన్స్ చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సాయి పల్లవి నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా .. ఈమె స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య రెమ్యునరేషన్‌ కూడా గట్టిగానే తీసుకుంటున్నారన్న టాక్ ఉంది. ఇక సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణ సినిమా చేస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీత క్యారెక్టర్ లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఈమె ఫ్యాన్స్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చడీచప్పుడు కాకుండా… శ్రీలీలతో లవ్‌స్టోరీ చేస్తున్న అఖిల్

హనీరోజ్‌ అమాయకురాలేం కాదు.. శరీరాన్ని చూపించి డబ్బులు.. నటి షాకింగ్ కామెంట్స్ !

SSMB29 నుంచి మరో సాలిడ్ అప్‌డేట్‌.. సంతోషం లో ఫ్యాన్స్

కొడుకును పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తల్లికి మూగజీవి ఓదార్పు

పొట్లకాయా.. అని తీసిపారేయకండి.. ఈ సమస్యలన్నటికి చెక్ పెడుతుంది అంతే..