విడాకుల ముచ్చట చెప్పడానికి కూడా టీజర్ , ట్రైలర్‌ రిలీజా?

Updated on: Aug 13, 2025 | 6:18 PM

చెబితే నాలుగు ముక్కలు..! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఆగిపోతాయిగా..! పోస్టు చేయాలనుకుంటే చిన్న ఎమోజీ గుర్తులు చాలు... ఈగర్‌గా వెయిట్ చేస్తున్న తన ఫ్యాన్స్‌కు కూడా ఓ క్లారిటీ వస్తుంది. కానీ ఈ అసలు విషయం చెప్పకుండా.. ఎందుకు ఊరిస్తోంది హన్సిక అని అంటున్నారు సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు.

తన భర్తతో విడాకులు తీసుకుంటే తీసుకున్నా అని.. లేదంటే లేదని చెబితే అయిపోయేదానికి ఇండైరెక్ట్‌ పోస్టులు… అందులో కొటేషన్లు ఎందుకు అని క్లాసు పీకుతున్నారు ఈమెకు. హన్సిక తన ఫ్రెండ్ మాజీ భర్త సోహైల్‌ను ప్రేమించి మరీ 2022 డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంది. రెండేళ్లు హ్యాపీగా మ్యారీడ్‌ లైఫ్ ఎంజాయ్‌ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను తన ఫ్యాన్స్‌తో పంచుకుంది.కట్ చేస్తే.. ఇప్పుడు తన హస్బెండ్‌కు సంబంధించిన ఫోటోలు లేకుండానే తన ఇన్‌స్టాను రన్‌ చేస్తోంది. అంతేకాదు తన భర్తకు దూరంగా తన తల్లితోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ బ్యూటీ కూడా ఇప్పుడు తన భర్తకు కటీఫ్‌ చెప్పిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ హీరోయిన్ బ్రేకప్‌ మ్యాటర్‌ను ఇన్‌స్టానే బట్టబయలు చేసిందనే కామెంట్ ఫన్నీగా వస్తోంది. అయితే ఈక్రమంలోనే తన బర్త్‌ డే సందర్భంగా హన్సిక చేసిన మరో పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ అవుతోంది. ఈ ఏడాది తాను అడగకుండానే తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని.. తనలో తనకు తెలియనంత బలం ఉందని తెలిసేలా చేసిందని పోస్ట్ చేసింది. ‘ఈ పుట్టిన రోజున మీ అందరి శుభాకాంక్షలతో నా మనసు ఉప్పొంగిపోతోంది. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఒక్కోసారి చిన్న విషయాలు కూడా ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని హన్సిక ఇన్‌స్టా గ్రామ్ స్టోరీ పెట్టింది. దీంతో హన్సిక విడాకుల విషయంపై సోషల్‌ మీడియాలో మరోసారి చర్చ జరుగుతోంది. దాంతో పాటే.. కలిసున్నారో.. లేక విడిపోయారో అన్నది చెప్పకుండా… ఈ సస్పెన్స్‌ ఏంటని.. కామెంట్‌ వస్తోంది. విడాకుల మ్యాటర్‌కు కూడా టీజర్ , ట్రైలర్ రిలీజ్ చేస్తావా అనే మీమ్‌ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

NTR కాదు.. విలన్‌గా వార్‌2లో సర్‌ప్రైజ్ స్టార్

ప్రభాస్ చెల్లి చేసిన పనికి.. నిరాశలో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌

మోహన్ బాబు పప్పు.. చరణ్ రసం! వావ్‌! వాటే కాంబినేషన్ గురూ

అర్హ క్యూట్ వీడియో.. అన్నయ్య‌ల‌కు రాఖీ కట్టి.. కాళ్లకు మొక్కిన బన్నీ త‌న‌య‌

కిరాతకంగా చంపి డెడ్‌ బాడీస్‌తో ఇల్లు కట్టుకోవడం ఏంట్రా? దిమాక్ ఖరాబ్ సినిమా..! బట్‌ ఫుల్ థ్రిల్‌!