‘నా ఫోటోలు జూమ్ చేసి చూశారు’ హీరోయిన్ ఎమోషనల్
సినీ పరిశ్రమలో హీరోయిన్ల ప్రయాణం కఠినం. ఈషా రెబ్బా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఒక దర్శకుడు తన ఫోటోషూట్ చూసి మోచేతులు నల్లగా ఉన్నాయని, అందంగా లేవని బాడీ షేమ్ చేశారన్నారు. ఈ వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధపెట్టాయని, నిస్సహాయతకు గురిచేశాయని, పరిశ్రమలో ఇలాంటివి సాధారణమని అప్పుడు తెలియదని ఆమె వెల్లడించారు.
అనుకుంటాం కానీ.. హీరోయిన్‌గా ఓ సినిమాలో సెలక్ట్ అవడం.. ఆ తర్వాత కొనసాగడం.. ఆ తర్వా రాణించడం అంత ఆషామాషీ విషయం కాదు. ఈ మధ్యలో ఎన్నో అవాంతరాలు.. ఎన్నో కామెంట్లు.. మరెన్నో విమర్శలు. ఇలా చాలా కష్టంగా ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ జర్నీ. అయితే కొందరు మాత్రం కొన్ని సందర్భాల్లో ఈ విషయాలపై ఓపెన్ మాట్లాడతారు. తమ కెరీర్లోని బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందరిలో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు హీరోయిన్ ఇషా రెబ్బా కూడా ఇదే చేశారు. తన కెరీర్ బిగినింగ్‌లో తనకు ఎవదురైన ఓ బ్యాడ్ సంఘటటను గుర్తు చేసుకుని కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎట్ ప్రజెంట్ తన అప్‌కమింగ్ సినిమా ‘ఓం శాంతి శాంతి’ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న ఈషా రెబ్బా.. ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న చేదు సంఘటన గురించి మాట్లాడింది. ఒక సినిమా కోసం తాను ఫోటో షూట్‌లో పాల్గొన్నానంటూ చెప్పిన రెబ్బా.. తన ఫోటోలను దర్శకుడు జూమ్ చేసి మరీ చూశాడని.. అలా చూశాక.. తన మోచేతులు నల్లగా ఉన్నాయని, మరింత అందంగా ఉండాలంటూ చెప్పినట్టు ఆమె వివరించారు. ఆయన మాటలు తనను బాధపెట్టాయని.. చాలా నిరూత్సాహం చెందానంటూ చెప్పారు. అంతేకాదు ఆ సమయంలో ఆ డైరెక్టర్‌కు తాను ఏ సమాధానం ఇవ్వాలనేది తెలియలేదంటూ.. చెప్పుకొచ్చారు. తన పుట్టుకతో వచ్చిన రంగును మార్చుకోలేను కదా అని.. తనను తాను సముదాయించుకున్నా అన్నారు. అయితేపరిశ్రమలో ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయని ఆప్పట్లో తనకు తెలీదన్నారు రెబ్బా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోహ్లి తాగిన ఆ డ్రింక్ ఖరీదెంతో తెలిస్తే మైండ్ బ్లాక్
ఐసీసీ అల్టిమేటంపై బంగ్లాదేశ్ రియాక్షన్
గుండె జబ్బులు మౌనంగా మృత్యుఘంట.. అసలు కారణాలేంటి.. ఎలా తగ్గించుకోవచ్చు
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై బిగ్ అప్డేట్..! వీడియో రిలీజ్ చేసిన అశ్విని వైష్ణవ్
