Kingdom Pre Release Event: కింగ్‌డమ్ సినిమాకు హార్ట్ బీట్ అతనే.. తెలుగులో స్పీచ్ అదరగొట్టిన భాగ్యశ్రీ బోర్సే.. వీడియో
Actress Bhagyashri Borse

Kingdom Pre Release Event: కింగ్‌డమ్ సినిమాకు హార్ట్ బీట్ అతనే.. తెలుగులో స్పీచ్ అదరగొట్టిన భాగ్యశ్రీ బోర్సే.. వీడియో

Updated on: Jul 28, 2025 | 9:46 PM

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండతో పాటు చిత్ర బృందమంతా హాజరైంది. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తెలుగులో మాట్లాడి ఆహూతులను అలరించింది.

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా కింగ్ డమ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్న నూరి తెరకెక్కించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా సోమవారం (జులై 28) రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండతో పాటు చిత్ర బృందం ఈ వేడుకలో సందడి చేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగాతనకు అవకాశమిచ్చిన డైరెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిందీ అందాల తార. అలాగే కింగ్ డమ్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ హార్ట్ బీట్ గా నిలిచిందని ప్రశంసలు కురిపించింది. ఇక సినిమాలో విజయ్  దేవరకొండ పవర్ ఫుల్ ఫెర్ఫామెన్స్ ఉంటుందని పేర్కొంది.

 

Published on: Jul 28, 2025 09:38 PM