Kanguva: ఇదేందిది.. ఆస్కార్ బరిలో కంగువ మూవీ !!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. విభిన్నమైన కంటెంట్ చిత్రాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు సూర్య. ఇక ఇటీవల ఈ స్టార్ హీరో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ కంగువ రిలీజైంది. అయితే ఈ చిత్రం మాత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మించాయి.
ఈ చిత్రం గతేడాది నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది. కానీ ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. అయినా కానీ ఈ మూవీ ఆస్కార్ లిస్టులో కనిపించడంతో .. ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయింది ఈమూవీ. ఎస్ ! థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యింది. ఆస్కార్‌కి ఎంపికైన చిత్రాల షార్ట్‌లిస్ట్‌లో కంగువా సినిమా చేరింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇక కంగువ చిత్రాన్ని దాదాపు రూ.400 కోట్లతో నిర్మించగా.. కేవలం రూ.105 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ సంవత్సవరం రిలీజ్ అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాగా కంగువ పేరు త్రూ అవుట్ సౌత్ ఇండియా ట్రెండ్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమంత గురించి మనసులో మాట బయటపెట్టిన చరణ్
బ్లాక్ టైగర్ ను ఎప్పుడైనా చూశారా ?? దేశంలో ఎక్కడెక్కడున్నాయో తెలుసా ??
75 లగ్జరీ వాచ్‌లు.. 200 డిజైనర్ బ్యాగులు, థాయ్ ప్రధాని ఎంత రిచ్చో..
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్..
ఎన్ని కోట్లు పెట్టి కొంటే ఏం లాభం.. ఆఖరికి ఎడ్ల బండితో లాగాల్సి వచ్చింది