నాపై చేతబడికి కేరళ వెళ్లి విరుగుడు చేయించుకున్నా : సుమన్‌ వీడియో

Updated on: Oct 26, 2025 | 4:01 PM

ఒకప్పుడు స్టార్ హీరో సుమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనపై చేతబడి జరిగిందని, దాని విరుగుడు కోసం కేరళలోని చోటానికరకు వెళ్ళానని వెల్లడించారు. రోగాలు, విజయాలు, ఎదురుదెబ్బలు అన్నీ కర్మ, కాలం వల్లే జరుగుతాయని ఆయన తాత్విక ధోరణిలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ఒకప్పటి ప్రముఖ హీరో సుమన్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై కీలక విషయాలు వెల్లడించారు. తన కెరీర్ బిజీగా ఉన్న సమయంలో తనపై చేతబడి జరిగిందని, ఎవరు చేశారో తెలియదని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమలోనే కాదు, వ్యాపార రంగంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయని, కేరళ ప్రజలకు దీని గురించి బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు. వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న సమయంలో కొందరు సూచించగా, కేరళలోని చోటానికరకు వెళ్లి చేతబడి విరుగుడు పూజ చేయించుకున్నానని సుమన్ వివరించారు. ఆ పూజ ప్రభావం గురించి స్పష్టంగా తెలియకపోయినా, తాను కాలం, కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతానని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్‌ సేఫ్టీ వీడియో

ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో

ల్యాప్‌టాప్స్‌ చార్జింగ్‌ పెట్టడంతో వీడియో