‘వదిన’ను పెళ్లి చేసుకున్న సాయికిరణ్ ఫోటోలు వైరల్
సినిమాలు, సీరియల్స్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు నటుడు సాయి కిరణ్. ఇటీవల అతను కోయిలమ్మ నటి స్రవంతితో కలిసి పెళ్లిపీటలెక్కాడు. తాజాగా తమ పెళ్లి ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుని మురిసిపోయాడీ నటుడు. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇక లెజెండరీ సింగర్ పి.సుశీలకు మనవడు వరసయ్యే సాయికిరణ్ హీరోగా, సహాయక నటుడిగా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు.
నువ్వే కావాలి సినిమాతో సాయి కిరణ్ కు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే లయతో కలిసి ప్రేమించు సినిమాలో నటించి సోలో హీరోగా సక్సెస్ కొట్టాడు. ఇక మనసుంటే చాలు’, ‘ఎంత బావుందో తదితర చిత్రాల్లోనూ సాయి కిరణ్ నటించాడు. అయితే ఆ తర్వాత కంటిన్యూ చేయలేకపోయాడు. ప్రస్తుతం బుల్లితెరపై బిజీ బిజీగా ఉంటున్నాడు సాయి కిరణ్. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం సీరియల్స్ అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. గతేడాది డిసెంబర్ లో తనతో పాటు ‘కోయిలమ్మ’ సీరియల్‌లో నటించిన స్రవంతితో కలిసి పెళ్లిపీటలెక్కాడు సాయికిరణ్. ఈ సీరియల్లో సాయికిరణ్ కి స్రవంతి వదినగా నటించింది. ఇక అప్పుడు మొదలైన వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో దాంపత్య బంధంగా మారింది. తాజాగా తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సాయి కిరణ్. దీంతో ఇవి ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.100 కోట్లతో కొత్త ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్
దిమ్మతిరిగే న్యూస్.. బన్నీతో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ భారీ బడ్జెట్ సినిమా
విశాల్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన హీరో