వరదలో చిక్కుకున్న స్టార్ హీరో.. సాయం కోసం ఎదురుచూపులు

Updated on: Aug 29, 2025 | 1:35 PM

స్టార్ హీరో మాధవన్ వరదల్లో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని తనే స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా బటయపెట్టాడు. దీంతో మాధవన్ ఇప్పుడెలా ఉన్నాడంటూ ఆయన ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు. వరదల నుంచి సేఫ్ గా బయటపడాలని కోరుకుంటూ సోసల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఓ సినిమా షూటింగ్‌ కోసం లద్దాఖ్ లోని లేహ్‌కి వెళ్లిన మాధవన్‌.. కుండపోత వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ సంగతి చెబుతూనే.. మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా పంచుకున్నాడు. 17 ఏళ్ల క్రితం లేహ్‌లో .. త్రీ ఇడియట్స్‌ షూటింగ్‌ జరిగిందని.. ఆ టైంలో కూడా అనుకోని రీతిలో తాను వరదల్లో చిక్కుకున్నానని.. మళ్లీ 17 ఏళ్ల తర్వాత అదే ప్లేస్‌లో వరదల్లో ఇరుక్కున్నట్టు తన పోస్టులో రాసుకొచ్చాడు మ్యాడీ. అయితేవరద కారణంగా అక్కడ రవాణా వ్యవస్థ స్థంబించటంతో.. వరద తగ్గే వరకు మ్యాడీ అక్కడే ఉండాల్సిన పరిస్థితి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తప్పతాగి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బెదిరించి.. పరారైన స్టార్ హీరోయిన్