Mansoor Ali Khan: మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? వేలూరులో లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

|

Apr 20, 2024 | 10:12 AM

సినీ నటుడు, వేలూరు నియోజకవర్గ లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థి మన్సూర్‌ అలీ ఖాన్‌ అస్వస్థతకు గురయ్యారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బుధవారం చివరి రోజు కావడంతో.. తమిళనాడులోని వేలూరులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న ఆయన అకస్మాత్తుగా అస్వస్థతతకు లోనయ్యారు. కార్యకర్తలు మన్సూర్‌ను వెంటనే గుడియాత్తంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ పై చెన్నై కేకేనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

సినీ నటుడు, వేలూరు నియోజకవర్గ లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థి మన్సూర్‌ అలీ ఖాన్‌ అస్వస్థతకు గురయ్యారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బుధవారం చివరి రోజు కావడంతో.. తమిళనాడులోని వేలూరులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న ఆయన అకస్మాత్తుగా అస్వస్థతతకు లోనయ్యారు. కార్యకర్తలు మన్సూర్‌ను వెంటనే గుడియాత్తంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ పై చెన్నై కేకేనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో చికిత్స పొందిన మన్సూర్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కుదుటపడింది. ఆయన డిశ్చార్జ్ అయ్యారని సమాచారం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా వేలూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఆయనకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే తనకు పండ్ల రసంలో ఎవరో విషం కలిపి ఇచ్చారని మస్సూర్‌ సంచనల ఆరోపణల చేశారు. గుడియాత్తం నుంచి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు దారిలో కొందరు తనకు పండ్ల రసం, మజ్జిగ ఇచ్చారన్నారు. పండ్ల రసం తాగిన కొద్ది నిమిషాలకే తనకు కళ్లు తిరిగి గుండెల్లో నొప్పి వచ్చిందని మన్సూర్‌ పేరొన్నారు. ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత కోలుకున్నానని మన్సూర్‌ చెప్పారు. వేలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన్సూర్‌కు జాక్‌ఫ్రూట్ గుర్తును కేటాయించింది ఎన్నికల కమిషన్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!