గజరాజు నడిస్తే.. గజ్జికుక్కలు అరుస్తాయి..

Updated on: Apr 04, 2025 | 1:27 PM

దసరా సినిమాతో నానికి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మళ్లీ న్యాచురల్ స్టార్‌తో కలిసి ది ప్యారడైజ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ పోస్టర్ ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో నాని ఊహించని లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకుండానే ఓటీటీలో ఢీల్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. అలాగే గ్లింప్స్ తోనే సంచనలం సృష్టించిన ఈ సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. స్క్రిప్ట్ విషయంలో నాని అసంతృప్తితో ఉన్నారని.. మార్పులు చేశారని.. దీంతో బడ్జెట్ మరింత పెరిగిపోయిందని.. దీంతో సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరిగింది. ఇక ఈ రూమర్స్ పై చిత్రయూనిట్ గట్టిగానే రియాక్ట్ అయ్యింది. తాజాగా ది ప్యారడైజ్ సినిమా గురించి వస్తున్న రూమర్స్ పై సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

47 ఏళ్ల వయసులో.. తండ్రి కాబోతున్న కమెడియన్

లిప్‌ లాక్ సీన్ ఉందని.. నితిన్ సినిమాను రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్‌

మెడలో చెప్పుల దండ వేసి.. యాట్యూబర్‌ను దంచికొట్టిన మహిళలు

హీరో కాదు.. పక్కా బిజినెస్ మ్యాన్ !! 500 కోట్ల ఆస్తులంటే మాటలు కాదుగా…