ఆ డైరెక్టర్‌ పెళ్లికి అదిరిపోయే సర్‌‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

Updated on: Oct 30, 2025 | 1:05 PM

ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో టూరిస్ట్ ఫ్యామిలీ ఒకటి. సింపుల్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించింది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ కలెక్షన్లు సాధించింది. కేవలం రూ. 5 కోట్లతో తెరకెక్కిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా రూ. 75 కోట్ల మేర వసూళ్లు సాధించింది.

ఆ తర్వాత ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాతోనే అభిషన్ జీవింత్‌ అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అంతకు ముందు యూట్యూబర్ గా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అభిషన్ తన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. కేవలం డైరెక్టర్ గానే కాదు ఈ సినిమాలో తన యాక్టింగ్ తోనూ ఆకట్టుకున్నాడీ కుర్రాడు. ఇప్పుడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. ఈనెల 31న తన మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి పెళ్లి పీటలెక్కనున్నాడు. ఈ క్రమంలో పెళ్లికి ముందే అభిషన్ కు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మాగేశ్ రాజ్‌. అభిషన్ వివాహ వేడుకను పురస్కరించుకుని ఈ యంగ్ డైరెక్టర్‌కు ఖరీదైన లగ్జరీ బీఎండబ్ల్యూ కారును పెళ్లి కానుకగా ఇచ్చారు నిర్మాత మాగేశ్ రాజ్‌. ఈ విషయాన్ని ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు యంగ్ డైరెక్టర్‌ అభిషన్ కు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆమెకు నోటి దురుసు.. వీళ్లద్దరికీ ప్రేమ ముసుగు! ఈసారి దిమ్మతిరిగే ఎలిమినేషన్‌