IAS to Movies: సినీరంగంపై మక్కువతో ఐఏఎస్‌ కు రాజీనామా.. సర్వీసులో ఉండగా పలు వివాదాలు.

|

Oct 05, 2023 | 7:24 PM

సినీరంగంపై ఉన్న మక్కువతో ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారులు కూడా ధ్రువీకరించారు. నటన, మోడలింగ్‌ అంటే అభిషేక్ సింగ్‌కు చాలా ఇష్టం. ఇప్పటికే ఆయన చాలా సినిమాల్లో నటించారు. అంతేకాదు, ఇన్‌స్టాగ్రాంలో ఆయనకు 50 లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు.

సినీరంగంపై ఉన్న మక్కువతో ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారులు కూడా ధ్రువీకరించారు. నటన, మోడలింగ్‌ అంటే అభిషేక్ సింగ్‌కు చాలా ఇష్టం. ఇప్పటికే ఆయన చాలా సినిమాల్లో నటించారు. అంతేకాదు, ఇన్‌స్టాగ్రాంలో ఆయనకు 50 లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. అభిషేక్ అర్ధాంగి శక్తి నాగ్‌పాల్ కూడా ఐఏఎస్ అధికారిణియే. యమునా నగర్‌ ఇసుక అక్రమ రవాణా కుంభకోణం వ్యవహారంలో ప్రజల మనిషిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలో అభిషేక్‌ పరిపూర్ణ సమాజ సేవకుడిగా మారారు. ఆ సమయంలో రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆక్సిజన్‌ కోసం ఇబ్బందులు పడుతున్నవారి అవసరాలు తీర్చారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలోనూ తనవంతు పాత్ర పోషించారు. సొంత గ్రామాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న శరణార్థుల ఇబ్బందులు తీర్చారు ఇలా ఎన్నో మంచిపనులు ఆయన చేశారు. సర్వీసులో ఉండగా అభిషేక్ సింగ్ కొన్ని వివాదాలను కూడా ఎదుర్కొన్నారు. 2015లో యూపీ నుంచి ఢిల్లీకి మూడేళ్ల డిప్యుటేషన్‌పై వెళ్లారు అభిషేక్‌సింగ్‌. అయితే ఉన్నతాధికారులు మరో రెండేళ్లు డిప్యుటేషన్‌ పొడిగించారు. ఆ సందర్భంలో అభిషేక్ కొంతకాలం పాటు మెడికల్ లీవ్ తీసుకోవడంతో ప్రభుత్వం ఆయనను 2020లో సొంత రాష్ట్రానికి పంపించింది. సరైన కారణం లేకుండా మూడు నెలలు ఆలస్యంగా విధుల్లో చేరారు. గతేడాది అభిషేక్ సింగ్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా కూడా వెళ్లారు. ఆ సందర్భంలో తనే ఎన్నికల పరిశీలకుడినన్న విషయం అందరికీ తెలిసేలా ఇన్‌స్టాలో ఆయన ఓ ఫొటో పోస్ట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఫలితంగా ఈసీ ఆయనను విధుల నుంచి తప్పించింది. ఏకంగా ఏడాది పాటు సస్పెండ్ చేసింది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ఆయన తాజాగా ఉద్యోగానికే రాజీనామా చేసేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..