Allu Arjun: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. లండన్ మ్యూజియంలో మైనంపు విగ్రహం.

|

Sep 20, 2023 | 5:52 PM

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ కు మరో అరుదైన గౌరవం దక్కినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే లండన్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియంలో అతడి మైనపు విగ్రహం కొలువుదీరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్తను అతడి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ విగ్రహానికి సంబంధించిన కొలతలు ఇవ్వడం కోసం బన్నీ లండన్‌కు వెళ్లనున్నారట.

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ కు మరో అరుదైన గౌరవం దక్కినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే లండన్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియంలో అతడి మైనపు విగ్రహం కొలువుదీరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్తను అతడి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ విగ్రహానికి సంబంధించిన కొలతలు ఇవ్వడం కోసం బన్నీ లండన్‌కు వెళ్లనున్నారట. ఇదే నిజమైతే ఈ ఘనత సాధించిన మరో దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్‌ నిలుస్తాడు. ఈ వార్తతో బన్నీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ప్రభాస్‌, మహేశ్‌బాబు మైనపు విగ్రహాలు మేడమ్‌ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇక సుకుమార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప.. ది రైజ్‌ తో బన్నీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప.. ది రూల్‌ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..